iDreamPost
android-app
ios-app

వివాదంలో ప్రముఖ సీనియర్‌ నటి!

  • Published Aug 11, 2023 | 9:22 AM Updated Updated Aug 11, 2023 | 9:22 AM
  • Published Aug 11, 2023 | 9:22 AMUpdated Aug 11, 2023 | 9:22 AM
వివాదంలో ప్రముఖ సీనియర్‌ నటి!

సీనియర్‌ నటి లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 50 ఏళ్లకు పైగా సినీ జీవితంలో కొన్ని వందల సినిమాల్లో నటించారు. 1968లో వచ్చిన ‘బాంధవ్యాలు’ సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. తెలుగులో 50కి పైగా సినిమాలు చేశారు. తెలుగు, తమిళంలో పాటు హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. సంవత్సరానికి రెండు, మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు.

ఇక, అసలు విషయానికి వస్తే.. వివాదాలకు దూరంగా ఉండే లక్ష్మి ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నాయి. పెళ్లిళ్లలో డ్యాన్సులు వేయటంపై ఆమె చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి. సోషల్‌ మీడియా వ్యాప్తంగా కొంతమంది నెటిజన్లు ఆమెపై ఫైర్‌ అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం లక్ష్మి ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ పెళ్లిళ్లలో నాకు నచ్చని విషయం ఏంటంటే.. అందరూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. తట్టుకోలేకపోతున్నా. మా ఇంట్లోలో కూడా జరుగుతోంది. బ్రాహ్మిన్స్‌ ఇళ్లలో ఇలాంటివి అస్సలు జరగవు.

కానీ, మా ఇంట్లో జరిగిన ఓ పెళ్లిలో మాత్రం ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్‌ చేశారు. పెళ్లి కుమారుడు మా వాడు.. అతడు సైలెంట్‌గా ఉన్నాడు. కానీ, పెళ్లి కూతురు, పెళ్లి కూతురు తల్లి, తండ్రి అందరూ డ్యాన్స్‌ చేస్తూ ఉన్నారు. ఓ ముసలామె కూడా తెగ డ్యాన్స్‌ చేసింది. అది చూస్తే నాకు ‘డ్యాన్స్‌ చేస్తూ ఏమైనా ఐతే ఏంటి?’ అని అనిపించింది. అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibomcasibom