Somesekhar
జియో సేవలపై నటి కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
జియో సేవలపై నటి కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
సీనియర్ నటి కుష్బూ అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో చాలా బిజీ బిజీగా ఉంటారు. అయినప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. మహిళలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాల మీద తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇక ట్విట్టర్లో వచ్చే నెగటీవ్ కామెంట్స్ పై కౌంటర్లు ఇస్తు, వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జియో సేవలపై ఆమె చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జియో సేవల పట్ల కుష్బూ అసంతృప్తి చెందింది. అందుకే సోషల్ మీడియా వేదికగా జియోను ఏకిపారేసింది. అసలేం జరిగిందంటే?
జియో సేవలు హైదరాబాద్ లో బాలేవని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన అసంతృప్తి, ఆగ్రహాన్ని ట్విట్టర్ ద్వారా తెలియపరిచింది. కుష్బూ ట్విట్టర్ లో ఈ విధంగా రాసుకొచ్చింది..”హైదరాబాద్ లో జియో కస్టమర్ కేర్ సర్వీస్ చాలా దుర్భలంగా ఉంది. జియో సేవలు అంతగా బాలేవు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా.. కస్టమర్ కేర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. ఇంత నిర్లక్ష్యాన్ని నేను ఎక్కడా చూడలేదు. జియో గురించి నేను కాస్త మంచిగా అనుకున్నాను, కానీ ఇక్కడ అలా లేదు” అంటూ జియో సేవలపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.
అయితే కుష్బూ ట్వీట్ పై జియో నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. కుష్బూ ప్రస్తుతం బీజేపీ పార్టీలో కీలక సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడు లో జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆమె.. తన ఓటు హక్కును తొలి విడత పోలింగ్ లో భాగంగా తమిళనాడులో వినియోగించుకున్నారు. కాగా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న పాపులర్ కామెడీ షో జబర్ధస్త్ లో జడ్జీగా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి జియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుష్బూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hello @JioCare , your customer care in Hyderabad sucks. They are clueless about the complaints raised and do not honor the promise of service to be done. It’s been more than 24 hours since the complaint was raised, but no one has turned up at the given time. And now your customer…
— KhushbuSundar (Modi ka Parivaar) (@khushsundar) April 27, 2024