iDreamPost
android-app
ios-app

నటి ఖుష్బూ సుందర్‌కు అత్యంత అరుదైన అదృష్టం!

  • Published Oct 04, 2023 | 6:01 PM Updated Updated Oct 04, 2023 | 6:01 PM
  • Published Oct 04, 2023 | 6:01 PMUpdated Oct 04, 2023 | 6:01 PM
నటి ఖుష్బూ సుందర్‌కు అత్యంత అరుదైన అదృష్టం!

ప్రముఖ నటి ఖుష్బూ సుందర్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించింది. కేరళలోని ప్రముఖ విష్ణు ఆలయంలో జరిగే నారీ పూజకు ఆమె ఎంపికయ్యారు. కేరళ, త్రిశూరులోని ప్రాచీన విష్ణుమాయ దేవాలయంలో ప్రతీ ఏటా ప్రత్యేకంగా ఈ నారీ పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ నారీ పూజల్లో భాగంగా ఓ మహిళను ఆహ్వానించి.. ఆలయ పండితులు ప్రత్యేకంగా వారిని సత్కరిస్తూ ఉంటారు. ఈ సారి నటి ఖుష్బూకు ఆ గౌరవం దక్కింది. తాజాగా, ఆమె నారీ పూజలో పాల్గొన్నారు. వేద పండితుల నుంచి ఘన సత్కారం అందుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆ పోస్టులో .. ‘‘ త్రిశూరులోని ప్రాచీన విష్ణుమాయ దేవాలయంలో జరిగే నారీ పూజకు నన్ను ఆహ్వానించటం అదృష్టంగా భావిస్తున్నాను. ఏడాదికి ఒకరిని మాత్రమే ఎంపిక చేస్తారు. దేవతే వారిని ఎంపిక చేస్తుందని వారు నమ్ముతారు. నాకు ఈ గౌరవాన్ని కలిగించిన ఆలయ పెద్దలకు, ఇతర వ్యక్తులకు నా కృతజ్ఞతలు. నేను ప్రేమించే వాళ్లు.. ఈ ప్రపంచం సంతోషంగా ఉండాలని కోరుకున్నాను’’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఖుష్బూ 1986లో వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. తమిళంలో ఓ దశాబ్ధానికిపైగా నెంబర్‌ 1 హీరోయిన్‌గా వెలుగొందారు. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆరిస్ట్‌గా సినిమాలు చేస్తున్నారు. మరి, ఖుష్బూ సుందర్‌కు దక్కిన అత్యంత అరుదైన గౌరవంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kushboo Sundar (@khushsundar)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet