iDreamPost
android-app
ios-app

ఖరీదైన ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • Author Soma Sekhar Published - 03:37 PM, Tue - 24 October 23

ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరుగాంచిన బాంద్రాలో 4BHK అపార్ట్ మెంట్ ను ఓ స్టార్ హీరోయిన్ కొనుగోలు చేసిందట. దాని విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే.

ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరుగాంచిన బాంద్రాలో 4BHK అపార్ట్ మెంట్ ను ఓ స్టార్ హీరోయిన్ కొనుగోలు చేసిందట. దాని విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే.

  • Author Soma Sekhar Published - 03:37 PM, Tue - 24 October 23
ఖరీదైన ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత తన మకాంను ముంబైకి మార్చింది. బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ.. అక్కడ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఇక తాజాగా ఈ అమ్మడు నటించిన సినిమా కూడా విడుదల అయ్యింది. ఇలాంటి టైమ్ లో ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదేంటంటే? ఈ స్టార్ హీరోయిన్ ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరుగాంచిన బాంద్రాలో 4BHK అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఈ భామ అక్కడ ఇల్లు కొసం వెతుకుతున్నట్లు చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అమ్మడు అత్యంత ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఖరీదైన ప్లాట్ ను కొన్న హీరోయిన్ ఎవరు? ఇప్పుడు చూద్దాం.

మహేశ్ బాబు-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ చిత్రం ద్వారా వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా వచ్చిన దోచెయ్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో.. ఈ ముద్దుగుమ్మ తన మకాంను బాలీవుడ్ కు షిఫ్ట్ చేసింది. అక్కడ వరసగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది. ఇక తాజాగా ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మిమి మూవీలో నటనకు గాను.. జాతీయ ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది.

అయితే గత కొన్ని చిత్రాల నుంచి కృతికి సరైన హిట్టు లేదు. లేటెస్ట్ గా ఆమె నటించిన గణపత్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని టాక్. ఇదిలా ఉండగా.. ఈ అమ్మడుకు సబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కృతి సనన్ సెలబ్రిటీలు ఉండే అత్యంత ఖరీదైన ఏరియా అయిన బాంద్రాలో ఓ 4-BHK ప్లాట్ ను కొనుగోలు చేసిందట. దాని విలువ అక్షరాల రూ. 35 కోట్లు అని సమాచారం. అంతే కాదండోయ్.. ఇక కృతి ఇంటి పక్కనే స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇల్లు కూడా ఉందట. దీంతో కృతి 35 కోట్లు పెట్టి ఇల్లు కొన్నదా? అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు. కాగా.. కృతి చివరిగా తెలుగులో ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో సీతగా కనిపించింది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş