iDreamPost
android-app
ios-app

గంటకు రూ. 5వేలు.. నెటిజన్ కామెంట్.. ఇచ్చిపడేసిన గృహలక్ష్మి నటి

  • Published Oct 04, 2023 | 12:27 PM Updated Updated Nov 03, 2023 | 12:02 PM
  • Published Oct 04, 2023 | 12:27 PMUpdated Nov 03, 2023 | 12:02 PM
గంటకు  రూ. 5వేలు.. నెటిజన్ కామెంట్.. ఇచ్చిపడేసిన గృహలక్ష్మి నటి

నటి కస్తూరి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. గృహలక్ష్మి సీరియల్లో తులసి అనగానే ఠక్కున గుర్తుకుపట్టేస్తారు. ఈ సీరియల్ ఆమెకు అంత క్రేజ్ తెచ్చిందన్న మాట. అంతకముందు సౌత్ సినిమాల్లో ఓ వెలుగు వెలిసిన ఈ మాజీ మిస్ చెన్నై.. ఇప్పుడు బుల్లితెరపై అలరిస్తోంది. తెలుగులో నిప్పురవ్వ, సోగ్గాడి పెళ్లాం, అన్నమయ్య, చిలక్కొట్టుడు, ఆకాశ వీధిలో వంటి సినిమాలు చేసింది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసి.. వదిన, అక్క క్యారెక్టర్లలో కూడా మెప్పించింది. అంతేకాకుండా సామాజిక అంశాలపై మాట్లాడుతూ.. ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తూ ఉంటుంది. లేడి సూపర్ స్టార్ నయనతార కాదంటూ ఓ సారి, రాముడికి మీసాలుంటాయా అని ప్రభాస్ సినిమా ఆదిపురుష్ విషయంలోనూ, ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్‌లో జరిగిన లొల్లిపై కూడా మండిపడింది. అలాగే గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటనపై కూడా కుక్కలు కూడా ఇలాంటి పనులు చేయవంటూ స్పందించింది.

అయితే తాజాగా తమిళ బిగ్ బాస్ పై స్పందించమని కోరితే.. ఆమె చెప్పిన సమాధానానికి ఓ నెటిజన్ దారుణమైన, జుగుప్పాకరమైన కామెంట్ చేయగా.. ఇచ్చి పడేసింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల ప్రారంభమైంది. అయితే గతంలో కస్తూరీ కూడా బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది. ఆ సీజన్‌లో వివాదాస్పద నటి వనిత విజయ్ కుమార్ కూడా ఓ కంటెస్టెంట్‌గా ఉంది. కాగా, ఇప్పటి సీజన్‌లో వనిత కుమార్తె జోవిక ఎంట్రీ ఇచ్చింది. ఈ షోపై కస్తూరీ శంకర్‌కు ప్రశ్నలు ఎదురైనట్లు ఉన్నాయి అనుకుంటా.. దానికి ఆమె సమాధానంగా.. ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ ను చూపించే షోను తాను చూడటం లేదని, అంత టైం, ఇంట్రెస్ట్, ఓపిక లేవంటూ చెప్పింది. తనకంటూ కొన్ని పనులు, ఫ్యామిలీ, బాధ్యతలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా తన ఇంట్లో టీవీ కూడా లేదని, తాను బిగ్ బాస్ చూడటం లేదని క్లారిటీ ఇచ్చింది.

అయితే ఆమె చేసిన కామెంట్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. డబ్బుల కోసమే షోకు వెళ్లావని, ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏంటని పిన్ చేస్తున్నారు. కాగా, ఓ యూజర్ మాత్రం దారుణమైన కామెంట్ చేశాడు. ‘అవునులే.. నువ్వు గంటకు రూ. 5వేలు తీసుకుంటావ్ కదా’ అంటూ వల్గర్ కామెంట్ రాశాడు. దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కస్తూరి. మీ ఇంట్లో నిన్ను ఇలానే పెంచారా.. సిగ్గుండాలి అంటూ చెంపదెబ్బ కొట్టినట్లు పేర్కొంది. అంతేకాకుండా పలువురు నెటిజన్లు చేసిన కామెంట్లకు రిప్లై ఇచ్చింది గృహ లక్ష్మీ నటి కస్తూరి. నటిగా తనకు తోచింది చెప్పడం..  ఆమె ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom