నటి కస్తూరి మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్.. బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారంటూ

నటి కస్తూరి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దీంతో అక్కడి ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

నటి కస్తూరి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దీంతో అక్కడి ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

నటి కస్తూరి గత కొన్ని రోజులుగా కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె తెలుగు వారిపై చేసిన దిగజారుడు కామెంట్స్ అగ్గిరాజేశాయి. రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్లని తక్కువచేసి మాట్లాడారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేసింది. 300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర రాణులకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే మరి శతాబ్దాలకు పూర్వమే ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..? అని పరోక్షంగా ద్రావిడ వాదులను ఆమె ప్రశ్నించారు.

దీంతో అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నటి కస్తూరిపై విమర్శలు వెల్లువెత్తాయి. కస్తూరి వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆమె కామెంట్స్ పై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమిళనాడులోని తెలుగు వారు ఆమెపై ఫిర్యాదు చేశారు. కస్తూరిపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కస్తూరిపై చెన్నైలోని ఎగ్మూర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ వివాదం కొనసాగుతుండగానే మరో వివాదంలో చిక్కుకుంది నటి కస్తూరి. మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసి పెను దుమారం రేపింది. అయితే ఈసారి తెలుగు వారిపై మాత్రం కాదు. ఈసారి ఉద్యోగులపై విరుచుకుపడింది.

అది కూడా బ్రాహ్మణేతర ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారని కస్తూరి కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలతో ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. కస్తూరి వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించాయి. నటి కస్తూరి వ్యాఖ్యలు కొన్ని వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని సృష్టిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది తమిళనాడు రెవెన్యూ అధికారుల సంఘం. ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడిన కస్తూరిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారుల సంగం కోరింది. ఇలా నటి కస్తూరి రోజుకో వివాదంతో విమర్శలపాలవుతుంది.

అయితే కస్తూరి తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. తెలుగువారిని బాధ పెట్టే ఉద్దేశం తనకు లేదని వెల్లడించింది. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. కాగా నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపాయి. డీఎంకే పార్టీ నేతలు తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని కస్తూరి ఆవేదన వ్యక్తం చేసింది. ఏ విషయం మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తున్నారని డీఎంకే వర్గాలపై మండిపడింది. మరి నటి కస్తూరి బ్రాహ్మణేతరులపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments