iDreamPost
android-app
ios-app

ప్రవేశ్‌పై ఫైర్‌ అయిన నటి కస్తూరి శంకర్‌!

  • Published Jul 05, 2023 | 4:16 PM Updated Updated Jul 05, 2023 | 4:16 PM
  • Published Jul 05, 2023 | 4:16 PMUpdated Jul 05, 2023 | 4:16 PM
ప్రవేశ్‌పై ఫైర్‌ అయిన నటి కస్తూరి శంకర్‌!

ప్రముఖ నటి కస్తూరి శంకర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సమాజంలో ప్రజలు ఎదుర్కొనే పలు సమస్యలు, ఇతర సంఘటనలపై ఆమె ఎప్పటి కప్పుడు తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తూ ఉంటారు. తాజాగా, ఆమె మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకున్న  ఓ దారుణ సంఘటనపై స్పందించారు. ఓ యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ఓ దుర్మార్గుడిపై తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

ఆ పోస్టులో.. ‘‘ ఛీ! కుక్కలు కూడా ఆ పని చేయవు. ఈ దారుణానికి పాల్పడ్డ ప్రవేశ్‌ శుక్లా అనే పిచ్చోడు.. మధ్య ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే కేదార​ నాథ్‌ శుక్లాకు ప్రధాన అనుచరుడట. ఈ అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే ఈ మ్యాటర్‌ చాలా సీరియస్‌ అవుతుంది. నేను దీని గురించి కచ్చితంగా అడుగుతాను. ఈ సందర్భంగా ఎయిర్‌ ఇండియా, టీఎన్‌బీజేపీలో జరిగిన సంఘటనలను కూడా నేను గుర్తు చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

ఇంతకీ ఏం జరిగింది.. 

మధ్య ప్రదేశ్‌లోని సింధి జిల్లాకు చెందిన ఓ గిరిజన యువకుడు రోడ్డు పక్క కూర్చుని సిగరెట్‌ తాగుతూ ఉన్నాడు. ఇది చూసిన  మధ్య ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే కేదార​ నాథ్‌ శుక్లాకు ప్రధాన అనుచరుడు ప్రవేశ్‌ శుక్లా.. యువకుడి దగ్గరకు వచ్చాడు. నా ముందే సిగరెట్‌ తాగుతావా? అంటూ అతడిపై రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా యువకుడిపై మూత్ర విసర్జన చేశాడు. దీన్నంతా ప్రవేశ్‌ స్నేహితుడు వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ప్రవేశ్‌ చేసిన ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet