iDreamPost
android-app
ios-app

పూనమ్ నిజంగానే పోతే బాగుండేది..నటి కస్తూరి ఫైర్!

  • Published Feb 05, 2024 | 4:20 PM Updated Updated Feb 05, 2024 | 4:20 PM

Kasthuri Angry On Poonam Pandey: ఇటీవలే పూనమ్ ఆడిన చావు డ్రామా గురించి అందరికి తెలిసిందే. ఈ ఇష్యూపై సామాన్య ప్రజల నుంచి సినీ ప్రముఖల వరకు అందరూ ఫైర్ అవుతున్నారు. తాజాగా నటి కస్తూరి శంకర్ కూడా పూనమ్ పై ఫైర్ అయ్యారు.

Kasthuri Angry On Poonam Pandey: ఇటీవలే పూనమ్ ఆడిన చావు డ్రామా గురించి అందరికి తెలిసిందే. ఈ ఇష్యూపై సామాన్య ప్రజల నుంచి సినీ ప్రముఖల వరకు అందరూ ఫైర్ అవుతున్నారు. తాజాగా నటి కస్తూరి శంకర్ కూడా పూనమ్ పై ఫైర్ అయ్యారు.

  • Published Feb 05, 2024 | 4:20 PMUpdated Feb 05, 2024 | 4:20 PM
పూనమ్ నిజంగానే పోతే బాగుండేది..నటి కస్తూరి ఫైర్!

నేటి సమాజంలో ఫ్రాంక్ వీడియోలు, ఫేక్ వార్తలు ఎక్కువైపోతున్నాయి. అంతేకాక అలాంటి వార్తలను స్వయంగా కొందరు నటీనటులే క్రియేట్ చేస్తున్నారు. అందుకు ఉదాహరణే పూనమ్ పాండే ఇష్యూ. ఇటీవల ఆమె పేరు వార్తల్లో తెగ వైరల్ అయ్యింది. పూనమ్ సర్వైకల్ క్యాన్సర్ తో మృతి చెందిందని, ఆ తరువాత అది అబద్ధమని తేలింది. తాను సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు అలా చేశానని వివరణ కూడా ఇచ్చారు. అయితే ఆ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. పలువురు సినీ ప్రముఖులు పూనమ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇక గృహలక్ష్మీ సీరియల్ ఫేమ్ కస్తూరి శంకర్ కూడా పూనమ్ ఇష్యూపై స్పందించారు.  పూనమ్ నిజంగానే చనిపోతే బాగుండేది అంటూ ఫైర్ అయ్యారు.

ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2011 క్రికెట్ వర్డల్ కప్ టైమ్ లో ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమె ఫేమ్ సంపాందించారు. ఆ తరువాత కూడా అనేక రకాల వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె వార్తల్లో ఉండేవారు. ఇటీవల ఏకంగా తాను చనిపోయానంటూ ఆడిన డ్రామా గురించి అందరికీ తెలిసిందే. మహిళలకు వచ్చే సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన  కల్పించేందుకు ఇలా చేశానంటూ పూనమ్ చెప్పిన వీడియో ఇప్పటికే వైరల్ అయింది.

అయితే పూనమ్ చేసిన ఈ వింత పబ్లిసిటీ స్టంట్ పై సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఆమెపై ఫైర్ అవుతూ కామెంట్స్ చేశారు. తాజాగా నటి కస్తూరి శంకర్ కూడా పూనమ్ పాండే ఇష్యూపై స్పందించింది. ఒక న్యూస్ ఛానల్‌లో జరిగిన డిబేట్‌లో పూనమ్‌ను ఏకిపారేసింది కస్తూరి. ఆమె మాట్లడుతూ..”ఇదొక చెత్త పబ్లిసిటీ స్టంట్.. ఇలాంటి వాటి వల్ల ఒరిగేదేం లేదు” అని కస్తూరి విమర్శించింది.

పూనమ్ పాండే మృతి అంత పెద్ద న్యూస్ గా తాను అనుకోవడం లేదని, క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంశాల కంటే పూనమ్ మృతి పెద్ద విషయమేం కాదని ఆమె అన్నారు. అయితే పూనం తాను చనిపోయానంటూ డ్రామా ఆటం మంచి పద్ధతి కాదని, ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన చేయాలని అమె అనుకుంటే వేరేలా చేసి ఉండొచ్చని కస్తూరి శంకర్ అన్నారు. సర్వైకల్ క్యాన్సర్ అనే మహమ్మారితో పొరాడుతొన్న కొన్నివేల మంది క్యాన్సర్ వారియర్స్ కి పూన్ పెద్ద డొనేషన్ ఇచ్చి ఉండొచ్చుని, ఇలా చేసి ఉంటే ఆమెపై మంచి  అభిప్రాయం వచ్చేదని కస్తూరి చెప్పుకొచ్చారు.

అలా కాకుండా తాను చనిపోయినట్లుగా నాటకం ఆడిందని, గతంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ పబ్లిసిటీ డ్రామాలు పూనమ్ చాలానే ఆడిందని కస్తూరి తెలిపారు. ఇంకా నయం తన పబ్లిసిటీ కోసం బ్రెస్ట్ క్యాన్సర్‌ను వాడుకోలేదు సంతోషం లేదంటూ కస్తూరి మండిపడింది. ఇక పూనమ్ ఆడిన ఈ డెత్ డ్రామా అంశంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అంతేకాక ఈ ఇష్యూలో పూనమ్ పాండే మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మరి.. పూనమ్ అంశంపై నటి కస్తూరి స్పందించిన తీరు, వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom