iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌ అని చెప్పి, చెల్లెలి పాత్ర ఇచ్చారు: కస్తూరి శంకర్‌

  • Published Nov 14, 2023 | 11:18 AM Updated Updated Nov 14, 2023 | 11:18 AM

కస్తూరి శంకర్‌ తెలుగులో అన్నమయ్య సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం పలు తెలుగు సీరియళ్లలో నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు...

కస్తూరి శంకర్‌ తెలుగులో అన్నమయ్య సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం పలు తెలుగు సీరియళ్లలో నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు...

  • Published Nov 14, 2023 | 11:18 AMUpdated Nov 14, 2023 | 11:18 AM
హీరోయిన్‌ అని చెప్పి, చెల్లెలి పాత్ర ఇచ్చారు: కస్తూరి శంకర్‌

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘కస్తూరి శంకర్‌’. సినిమా నటిగానే కాదు.. సీరియల్‌ నటిగానూ కస్తూరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఇక, నటిగా కెరీర్‌ మొదలుపెట్టిన తొలి నాళ్లలో ఆమె పలు స్టార్‌ దర్శకుల సినిమాల్లో నటించారు. దేశ దిగ్గజ దర్శకుడు శంకర్‌తో కూడా ఆమె పని చేశారు. సూపర్‌ హిట్‌ సినిమా ‘భారతీయుడు’లో ఓ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రంలో కమల్‌ చెల్లెలు, కూతురి పాత్రలో కనిపించారు. తాజా ఇంటర్వ్యూలో భారతీయుడు సినిమాలో తనను ఎంపిక చేయటంపై కస్తూరి శంకర్‌ మాట్లాడుతూ..

‘‘ చాలా హ్యాపీగా.. విలువతో ప్యాషనేట్‌గా మనం పని చేస్తాము. కానీ, అది ఎంత పెద్ద అదృష్టం అని తర్వాత తెలిసింది. చేసినపుడు సరదాగా చేసేవాళ్లం. ఎందుకంటే మనకి.. ఓ వైపు చూస్తే డ్రీమ్‌ కమ్‌ ట్రూ.. శంకర్‌ గారి సినిమా కాదలన్‌ చూసి ఓ పేపర్‌ కోసం ఇంటర్వ్యూ చేశాము. అప్పుడు ఫస్ట్‌ టైం మా ఇంటికి వచ్చేవారు. ఆ ఇంటర్వ్యూ చేసేప్పుడు శంకర్‌ గారిని చూసి చాలా ఎడ్మైర్‌ చేశాను. అప్పుడే పెద్ద ఫ్యాన్‌. తర్వాతి సినిమా ‘ ఇండియన్‌’ నేను కూడా చేస్తాననుకోలేదు. ఫస్ట్‌ ఉర్మిళ పాత్ర కోసం నన్ను అడిగే వారు. అప్పుడు కరెక్ట్‌గా రంగీళ ప్రమోషన్స్‌ వచ్చాయి.

నేను స్విమ్‌ సూట్‌లో దిగిన ఫొటోలు సెండ్‌ చేశాను. ఆ రోజే ఉర్మిళ ‘తన్హా.. తన్హా’ పాట వచ్చింది. దీంతో ఉర్మిళను తీసుకున్నారు. తర్వాత నన్ను చెల్లెలి పాత్ర కోసం అడిగారు. నేను అలిగాను. ‘ ఏంటండి.. కమల్‌ హాసన్‌ హీరోయిన్‌గా అడిగి.. ఇప్పుడు సిస్టర్‌ అంటున్నారే’ అని. కథ ప్రకారం ఇదే మంచి పాత్ర అని నాకు కాన్ఫిడెన్స్‌ ఇచ్చారు. కథ మొత్తం నామీదే తిరుగుతుంది. ఏం చెప్పనండి.. ఎలా చెప్పనండి.. అదొక కాంబినేషన్‌ అయినా సరే.. ఏఎమ్‌ రత్నం.. ఆయన్ని తమిళనాడులో ఆంధ్ర మణిరత్నం అంటారు. శంకర్‌, జీవా, ఏఆర్‌ రెహమాన్‌, కమల్‌ హాసన్‌.. ఆ కాంబినేషన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే..’’ అని అన్నారు.

కాగా, ఒకప్పుడు సినిమా స్టార్‌గా పలు తెలుగు సినిమాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం సీరియళ్లలో బిజీ అయిపోయారు. తమిళంతో పాటు తెలుగులోనూ సీరియళ్లు చేస్తున్నారు. సినిమా, సీరియల్‌ షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్‌ మీడియాను మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయరు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రజా సమస్యలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. మరి, సీరియళ్లతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న కస్తూరి శంకర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom