iDreamPost
android-app
ios-app

ICU లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తల్లి!

  • Published Dec 18, 2023 | 3:40 PM Updated Updated Dec 18, 2023 | 3:40 PM

సోషల్ మాధ్యమాలు వచ్చిన తర్వాత సినీ సెలబ్రెటీలు తమకు సంబంధించిన ప్రతి ఆప్ డేట్ ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

సోషల్ మాధ్యమాలు వచ్చిన తర్వాత సినీ సెలబ్రెటీలు తమకు సంబంధించిన ప్రతి ఆప్ డేట్ ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

  • Published Dec 18, 2023 | 3:40 PMUpdated Dec 18, 2023 | 3:40 PM
ICU లో బాలీవుడ్  స్టార్ హీరోయిన్ కాజోల్ తల్లి!

ఇటీవల సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరుతున్నారు. తమకు సంబంధించిన ప్రతి అప్ డేట్ ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. నటీనటులను అభిమానించే ఫ్యాన్స్ వారు సంపూర్ణ అరోగ్యంగా ఆస్పత్రి నుంచి రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ప్రముఖ నటి కాజోల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ మూవీలో కీలక పాత్రలో కనిపించారు. తాజాగా నటి కాజోల్ తల్లి తనూజ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ తల్లి, పాత తరం హీరోయిన్ తనూజ తీవ్ర అస్వస్థతకు గురి కావడవంతో ముంబై జూహూలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తనూజ వయసు 80 సంవత్సరాలు. కొంత కాలంగా తనూజ వృద్దాప్య సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. పాత తరం నటీమణుల్లో తనూజకు మంచి పేరు ఉంది. బాలీవుడ్ మూవీస్ లోనే కాదు, బెంగాళీ మూవీస్లో కూడా నటించింది. తనూజ తల్లి శోభన సమ్రాట్ కూడా సినీ నటి కావడం గమనార్హం. ఆమె తండ్రి కుమార్ సేన్ సమ్రాజ్ పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

మరాఠీ కుటుంబంలో జన్మించింది నటి తనూజ బాల నటిగా తన అక్క నూతన్ తో కలిసి ‘హమారీ బేటీ’ మూవీలో నటించింది. ఆ తర్వాత తన తల్లి శోభన సమ్రాట్ దర్శకత్వం వహించిన ఛబిలి చిత్రంలో నటించింది. బహరెన్ ఫిర్ భీ ఆయేంగీ మూవీతో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. తనూజ 1973 లో చిత్ర నిర్మాత షోము ముఖర్జీని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు నటి కాజోల్, తనీషా. కాజోల్ కూడా తల్లి తరహాలోనే హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. తనూజ భర్త షోము ముఖర్జీ 2008లో గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అభిమానులు, సెలబ్రెటీలు ఆరోగ్యంగా కోలుకొని రావాలని ప్రార్థిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş