మనం ఎంత ముందుకు వెళ్తున్నా, సాంకేతికంగా ఎంత సాధిస్తున్నా.. ఇప్పటికీ సమాజంలో కొన్ని విషయాలను బహిరంగంగా చర్చించేందుకు ఇష్టపడరు. వాటిలో శృంగారం మొదటిస్థానంలో ఉంటుంది. అందులోనూ స్త్రీలకు సంబంధించి అయితే అది ఏదో బ్రహ్మ పదార్థం అన్నట్లే చూస్తారు. అయితే ఇప్పుడిప్పుడే సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారాఈ అంశాన్ని టచ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఓపెన్ ఆ అంశం గురించి మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు. ఆ జాబితాలోకి సీనియర్ నటి కాజోల్ కూడా చేరింది. స్త్రీల లైంగిక సంతృప్తి అంశంపై కాజోల్ కామెంట్స్ చేసింది.
శృంగారం, లస్ట్ కి సంబంధిచి ఈ మధ్య ఇండస్ట్రీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు బాగానే వస్తున్నాయి. ఆ జాబితాలో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ముందు వరుసలో ఉంటుంది. నలుగురు విభిన్నమైన స్త్రీల జీవితంలో జరిగే సంఘటనలు, వారు జీవితంలో ఏం కోల్పోయారు, ఎలాంటి కోరికలను దాచుకున్నారు అనే నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2 అని వెబ్ సిరీస్ ని నిర్మించారు. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
లస్ట్ స్టోరీస్ 2లో కాజోల్, తమన్నా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, అమృతా సుభాష్, తదితరులు నటించారు. గత కొన్నిరోజులుగా వీళ్లంతా నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నారు. బోల్డ్ సన్నివేశాలు, రొమాంటింక్ సీన్స్ తోనే కాకుండా.. వీరి కామెంట్స్ తో కూడా బాగా వైరల్ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్ మాట్లాడుతూ.. “ఒక దశలో సొసైటీలో స్త్రీల లైంగిక సంతృప్తి గురించి బాహాటంగానే మాట్లాడుకున్నారు. ప్రాచీన గ్రంథాలు, బోధనల్లో ప్రస్తావించారు కూడా. కాలక్రమంలో ఆ విషయాలనే మనం పట్టించుకోవడం మానేశాం.
నిజానికి అది ప్రతి ఒక్కరి జీవితంలో రోజూ జరిగేదే. తినడం, తాగడం లాగానే దానిని కూడా సాధారణంగానే చూడాలి. ఈ టాపిక్ ను మీరు చర్చకు ఎంత దూరంగా ఉంచితే దానిపై ఆసక్తి అంత పెరుగుతుంది. మీరు ఓపెన్ గా డిస్కస్ చేయడమే మంచిది. సినిమాల్లో కూడా ప్రేమ కోసం ప్రాణాలు వదిలేశారు అనే కథలను ఆపేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరూ అలా లేరు. మల్టిపుల్ సోల్ మేట్స్ ని నమ్ముతున్నారు. లస్ట్ స్టోరీస్ కూడా అలాంటి కథలను తెలియజేయడానికే తీశాం. ఇందులోని కథలు అన్నీ స్నేహం, మెడరన్ రిలేషన్స్, సమాజం ఆధారంగానే ఉంటాయి” అంటూ వ్యాఖ్యానించింది.