iDreamPost
android-app
ios-app

ఆ విషయాలు రహస్యంగా ఉంచిన ఇలియానా! .. బిడ్డ పుట్టిన తర్వాత..

  • Published Jan 05, 2024 | 10:06 PM Updated Updated Jan 05, 2024 | 10:06 PM

నటి ఇలియానా గతేడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నటి ఇలియానా గతేడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

  • Published Jan 05, 2024 | 10:06 PMUpdated Jan 05, 2024 | 10:06 PM
ఆ విషయాలు రహస్యంగా ఉంచిన ఇలియానా! .. బిడ్డ పుట్టిన తర్వాత..

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో రామ్ నటించిన దేవదాసు చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ కుర్ర కారు గుండెల్లో గుబులు రేపింది. ఆ సినిమా యూత్ కు విపరీతంగా నచ్చడంతో ఇలియానాకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు క్యూకట్టాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్ గా మారిపోయింది. పోకిరీ, జల్సా, మున్నా ఇంక ఇతర సినిమాల్లో నటించి అలరించింది. కొంతకాలానికి సినిమాలకు దూరమైన ఇలియానా ఫ్యాన్స్ కు ఊహించని షాకిచ్చింది. పెళ్లి కాకుండానే తాను ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇలియానా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

గతేడాది ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే తను తన కొడుకు ఫోటోలను వీడియోలను నెటిజన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. తన బాబు పేరు ఫీనిక్స్ డోలన్ అని పెట్టినట్టు కూడా తెలిపింది. కాగా తాజాగా ఇలియానా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రసవానంతరం తాను పడ్డ బాధలను మీడియాతో పంచుకుంది. నేను బిడ్డ పుట్టాక చాలా డిప్రెషన్ కి గురయ్యాను. బాధతో ఏడ్చాను. గది నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. నా బాబు వేరే గదిలో పడుకుంటే వైద్యులు బాగా చూసుకున్నారు. ఆ సమయంలో నాకు భర్త మైఖేల్ డోలన్ తోడుగా నిలబడ్డాడు అని తెలిపింది.

ilean baby birth

నాకు ఏ ఇబ్బంది కలగకుండా రెస్ట్ తీసుకొమ్మని చెప్పి బాబుని తనే చూసుకునేవాడు అని చెప్పింది. ఇంత మంచి వ్యక్తి నాకు భర్తగా రావడం నా అదృష్టం అని తెలిపింది. అయితే ఇలియానా భర్త విషయంలో మాత్రం సీక్రెట్ గానే ఉంటుంది. ఇటీవల కొన్నాళ్ల క్రితం తన భర్తతో ఉన్న ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే భర్త గురించి మొదటిసారి చెప్పినప్పుడు కొందరి మాటలు తనను బాధించాయని అందుకే ఆ విషయాలను రహస్యంగా ఉంచినట్లు తెలిపింది. నా కుటుంబం, ప్రియుడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తనకు నచ్చదని ఇలియానా వెల్లడించింది. మరి ఇలియానా పర్సనల్ లైఫ్ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş