iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో స్టార్ హీరోయిన్ ఉంది.. గుర్తు పట్టారా?

  • Published Mar 14, 2024 | 8:06 PM Updated Updated Mar 14, 2024 | 8:06 PM

Star Heroine Childhood Pic: ఓ స్టార్ హీరోయిన్ తన స్కూల్ డేస్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

Star Heroine Childhood Pic: ఓ స్టార్ హీరోయిన్ తన స్కూల్ డేస్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

  • Published Mar 14, 2024 | 8:06 PMUpdated Mar 14, 2024 | 8:06 PM
ఈ ఫోటోలో స్టార్ హీరోయిన్ ఉంది.. గుర్తు పట్టారా?

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు ఎక్కువగా సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు. తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్, కెరీర్ విషయాలు, వెకేషన్స్ కి వెళ్లినప్పటి ఫోటోలు, వీడియోలు అభిమానులకు షేర్ చేస్తున్నారు. సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న నటీమణులు ఎంతోమంది ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కరలేదు.  మరికొంతమంది సెలబ్రెటీలు తమకు సంబంధించిన చైల్డ్ హుడ్, ఇతర జ్ఞాపకాలకు సంబందించిన స్పెషల్ ఫోటోలు సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. అలాంటి ఫోటోలకు లైకులు, షేర్లు తెగ వచ్చేస్తున్నాయి. ప్రముఖ నటి తన స్కూల్ డేస్ ఫోటోని షేర్ చేసింది. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ బ్యూటీ హనీ రోజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇటీవల ఈ అమ్మడు ఫోటో ఫీచర్లతో పిచ్చెక్కిస్తుంది. హనీ రోజ్ తాజాగా తన స్కూల్ డేస్ కి సంబంధించిన ఓ ఫోటోని అభిమానుల కోసం షేర్ చేసింది. ఇందులో తాను ఎక్కడ ఉన్నానో చెప్పమని ఫ్యాన్స్ ని కోరింది. సినిమాల్లోనే కాదు.. రీల్స్ లో కూడా హనీ రోజ్ ఎప్పుడూ సందడి చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో స్వైప్ చేస్తే ఈ అమ్మడికి సంబంధించిన రీల్స్ దర్శనమిస్తాయి. మలయాళ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో నటించింది. ఇటీవల బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో కనిపించింది. ఇటీవల  పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లో హల్ చల్ చేసింది. చాలా మంది వ్యాపారవేత్తలు తమ షాపింగ్ మాల్స్, జ్యులరీ షాపుల ఓపెనింగ్స్ కి హనీ రోజ్ ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారు. ఆ సమయంలో ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగుతూ తెగ సందడి చేస్తుంది.  ఈ అమ్మడి ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.

Honey rose school photo

కేరళలోని మూలమట్టంలోని సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది హనీ రోజ్. ఈమె పూర్తి పేరు హనీ రోజ్ వర్గీస్. 2005లో తన 14వ ఏటనే కెరీర్ ప్రారంభించింది. వినయన్ దర్శకత్వంలో మలయాళ చిత్రం ‘బాయ్ ఫ్రెండ్ ’ లో హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. 2008లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో శివాజీ హీరోగా నటించిన ‘ఆలయం’ మూవీతో తెలుగు అరంగేట్రం చేసింది. తర్వాత ‘ఈ వర్షం సాక్షిగా’లో నటించింది. చాలా గ్యాప్ తీసుకొని బాలయ్య నటించిన వీర సింహారెడ్డి మూవీలో నటించింది. తన స్కూల్ డేస్ ఫోటోను షేర్ చేసిన హనీరోజ్.. ఈ ఫోటోలో ఎక్కడ ఉన్నానో చెప్పుకోండి చూద్దాం అంటూ అడిగింది. ఈ ఫోటో చూసి చాలా మంది అభిమానులు తమకు తెలిసిన సమాధానాలు చెబుతున్నారు. మరీ ఈ ఫోటోలో హనీ రోజ్ ఎక్కడ ఉందో మీరూ చెప్పండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss