iDreamPost
android-app
ios-app

క్యాన్సర్‌తో పోరాడుతూనే..షూటింగ్‌కి రెడీ అయిన హీరోయిన్!

  • Published Jul 16, 2024 | 2:15 PM Updated Updated Jul 16, 2024 | 2:15 PM

Actress Hina Khan: సినీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ నటీనటులను క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుంది. క్యాన్సర్‌తో పోరాడి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే సరైన ట్రీట్‌మెంట్ తీసుకొని బతికి బయట‌పడ్డ నటీనటులు ఉన్నారు.

Actress Hina Khan: సినీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ నటీనటులను క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుంది. క్యాన్సర్‌తో పోరాడి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే సరైన ట్రీట్‌మెంట్ తీసుకొని బతికి బయట‌పడ్డ నటీనటులు ఉన్నారు.

  • Published Jul 16, 2024 | 2:15 PMUpdated Jul 16, 2024 | 2:15 PM
క్యాన్సర్‌తో పోరాడుతూనే..షూటింగ్‌కి రెడీ అయిన హీరోయిన్!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది నటీనటులు క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. కొంతమంది మాత్రం క్యాన్సర్ పోరాడి ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ప్రముఖ టీవీ సీరియల్ ‘ ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’తో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న బుల్లితెర హీరోయిన్ హీనా ఖాన్ ఇటీవల క్యాన్సర్ భారిన పడ్డారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్నాని తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నారు. తాను క్యాన్సర్ భారి నుంచి ఖచ్చితంగా బయటపడతానని నమ్మకంతో ఉన్నారు. తాజాగా హీనా ఖాన్ క్యాన్సర్ తో బాధపడుతూనే షూటింగ్ కి రెడీ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ బుల్లితెర హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీనా ఖాన్ ఇటీవల బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి భారిన పడ్డారు. అయితే క్యాన్సర్ అనగానే మొదట ఎంతో భయం వేసిందని.. మానసికంగా కృంగిపోయానని కన్నీరు పెట్టుకుంది. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్యులు తనకు ఎంతో ధైర్యం చెప్పారని..ప్రస్తుతం క్యాన్సర్ ట్రీట్‌మెంట్ నడుస్తుందని తెలిపింది. ఇటీవల హీనా ఖాన్ కి మొదటి కీమో సెషన్ పూర్తయ్యిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె మళ్లీ షూటింగ్‌కి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో పాపులర్ టీవీ సీరియల్ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’ లో ఆమె అక్షర పాత్ర పోషించింది. ఈ పాత్ర హీనా ఖాన్ కి ఎంతో పాపులారిటీ తెచ్చిపెట్టింది. బిగ్ బాస్, ఖత్రోన్ కె ఖిలాడీ వంటి రియాల్టీ షోలో పాల్గొంది.

క్యాన్సర్ తో పోరాడుతూనే మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నా అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ‘నేను క్యాన్సర్ తో బాధపడుతున్నా.. అయినా కూడా మొక్కవోని దైర్యంతో ఉన్నా. నేను షూటింగ్ కి హాజరయ్యాను. చెడు రోజులు తక్కవగా ఉన్నా.. సంతోషంగా గడపడం మర్చిపోవొద్దు. మనకు వచ్చే కష్టాలను పెద్దగా చూడొద్దు. ఇప్పుడున్నవి ముఖ్యమైన రోజులు.. మార్పును అంగీకరిస్తూ..గతంలో మాదిరిగా ప్రయత్నించాలి.’ అంటూ ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధితో పోరాడుతూ ఆమె మనోధైర్యానికి మెచ్చుకోవచ్చు అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by 𝑯𝒊𝒏𝒂 𝑲𝒉𝒂𝒏 (@realhinakhan)

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş