iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్ లో మొదలైన LOVE.. కానీ మతం అడ్డు రావడంతో..

  • Published Dec 07, 2023 | 5:38 PM Updated Updated Dec 07, 2023 | 5:43 PM

ప్రేమకు కుల, మతాలు అడ్డుకావని ఇదివరకే ప్రేమ పక్షులు నిరూపించారు. అంతే కాదండోయ్ దేశ సరిహద్దులు కూడా ప్రేమకు అడ్డుకావని తేలిపోయింది. ఇలాంటి తరుణంలో ఓ నటి మత విశ్వాసాల కోసం తన ప్రేమను త్యాగం చేసింది. అసలేం జరిగిందంటే?

ప్రేమకు కుల, మతాలు అడ్డుకావని ఇదివరకే ప్రేమ పక్షులు నిరూపించారు. అంతే కాదండోయ్ దేశ సరిహద్దులు కూడా ప్రేమకు అడ్డుకావని తేలిపోయింది. ఇలాంటి తరుణంలో ఓ నటి మత విశ్వాసాల కోసం తన ప్రేమను త్యాగం చేసింది. అసలేం జరిగిందంటే?

  • Published Dec 07, 2023 | 5:38 PMUpdated Dec 07, 2023 | 5:43 PM
బిగ్‌బాస్ లో మొదలైన LOVE.. కానీ మతం అడ్డు రావడంతో..

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ.. కొందరు తొలి చూపులోనే ప్రేమలో పడిపోతారు. మరికొందరు అవతలి వారి చూపుల్లో, మాటాల్లో, అభిరుచులను చూసి లవ్ లో పడతారు. అయితే ఏదీ ఏమైనా ఈ ప్రేమలో పడటం, దానిలో మునిగి తేలడం, తర్వాత బ్రెక్ అప్ అవడం.. కామన్ అయిపోయింది అందరికి . ఇప్పుడు ఈ తరహాలోనే.. సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మొదట స్నేహమని.. తర్వాత.. డేటింగ్ అని, చివరికి.. బ్రెక్ అప్ అంటూ పోస్ట్ లు పెడతారు. అయిన ఈ సెలబ్రిటీలకు ప్రేమ, పెళ్లి, విడిపోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తాజాగా ఓ నటి మత విశ్వాసాల కోసం తమ ప్రేమను త్యాగం చేశామని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రముఖ పంజాబీ నటి, సింగర్ హిమాన్షి ఖూరానా.. ఈమె పాపులర్ రియాల్టి షో అయిన బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయ్యింది. హిందీలో 13వ సీజన్ గా ప్రారంభమైన ఈ షోలో మరో కంటెస్టెంట్ అసిమ్ రియాజ్ కూడా ఉన్నాడు. అక్కడ వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే హిమాన్షి ఆ సీజన్ మొదటిలోనే ఎలిమినేట్ కాగా.. రియాజ్ మాత్రం రన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ షోలో మొదలైన వీరి ప్రేమాయణం సుమారు 3 ఏళ్ల పాటు కొనసాగింది. ఇంతలోనే.. వీరి ప్రేమకు బ్రేక్ పడింది. ఇదే విషయాన్ని తాజాగా సినీనటి, సింగర్ అయిన హిమాన్షి అధికారికంగా తెలిపింది. అసిమ్ రియాజ్ తో తమ ప్రేమకు పుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. వివిధ మత విశ్వాసాల కారణంగా తమ ప్రేమని త్యాగం చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది.

సోషల్ మీడియా తన బ్రేకప్ పోస్ట్ ను పంచుకుంటూ, హిమాన్షి ఇలా తెలిపింది. ‘అవును, ఇకపై మేము కలిసి ఉండాలని అనుకోవడం లేదు. మేము కలిసి గడిపిన సమయమంతా అద్భుతమైనది. కానీ మా బంధం ముగిసింది. మా రిలేషన్ షిప్ ప్రయాణం చాలా ఆద్భుతమైనది. మేము మా ప్రత్యేక జీవితాలలో ముందుకు సాగుతున్నప్పుడు, మేము మా విభిన్న మత విశ్వాసాల కోసం మా ప్రేమను త్యాగం చేస్తున్నాం అని తెలిపింది. అంతేకాకుండా.. ప్రతి ఒక్కరూ తమ గోప్యతను గౌరవించాలని ఆమె కోరుతున్నట్లు అభిమానులను అభ్యర్థించింది’.

కాగా, హిమాన్షి ఖూరానా పంజాబీ సిక్కు కుటుంబానికి చెందినది. ఇక అసిమ్ రియాజ్ ముస్లిం మతానికి చెందిన జమ్మూ ప్రాంత వాసి. అయితే బిగ్ బాస్ లో కలుసుకున్న ఈ జంట బయటకు వచ్చిన తర్వతా కూడా లవ్ బర్డ్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా ప్రేమ పాటల్లో కలిసి నటించారు. అలాగే హిమాన్షి మరో పోస్ట్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో.. ‘మా ప్రేమను కాపాడుకునేందుకు మేమిద్దరం ప్రయత్నించాము. కానీ, అందుకు పరిష్కారం కనుగొనలేకపోయాము. తామిద్దరం ఎంతగానో ప్రేమించుకున్నాం. అయినప్పటికి కలిసి జీవించే అదృష్టం లేదు. మా మధ్య ఎలాంటి ద్వేషం లేదు, ప్రేమ మాత్రమే ఉంది. దీనిని పరిణితి చెందిన నిర్ణయం అంటారని భావిస్తున్న’ అని తెలిపింది. మరి, మత విశ్వాసం కోసం విడిపోయిన ఈ జంట పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలపండి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetceltabet girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom