iDreamPost
android-app
ios-app

రేవ్ పార్టీ కేసులో వెనక్కి తగ్గని నటి హేమ..కొత్త వీడియో రిలీజ్!

  • Published May 21, 2024 | 5:01 PM Updated Updated May 21, 2024 | 5:01 PM

Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారిన సంచలన న్యూస్. పుట్టిన రోజు పేరుతో రేవ్ పార్టీ నిర్వహించడమే కాదు డ్రగ్స్, గంజాయితో అడ్డంగా బుక్కయ్యారు నిర్వాహకులు. ఇందులో నటి హేమ పేరు వినిపించడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారిన సంచలన న్యూస్. పుట్టిన రోజు పేరుతో రేవ్ పార్టీ నిర్వహించడమే కాదు డ్రగ్స్, గంజాయితో అడ్డంగా బుక్కయ్యారు నిర్వాహకులు. ఇందులో నటి హేమ పేరు వినిపించడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

రేవ్ పార్టీ కేసులో వెనక్కి తగ్గని నటి హేమ..కొత్త వీడియో రిలీజ్!

బెంగుళూరు రేవ్ పార్టీ ఇప్పుడు పెను సంచలనాలు సృష్టిస్తుంది. ఈ పార్టీలో రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారని వార్తలు రావడంతో ఫోకస్ మొత్తం బెంగుళూరు ఫామ్ హౌజ్ వైపు మళ్లింది. పుట్టిన రోజు పేరుతో రేవ్ పార్టీ నిర్వహించి డ్రగ్స్ విచ్చలవిడిగా వాడినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు రేవ్ పార్టీని సీరియస్ గా తీసుకొని పోలీసులు అందరి బ్లెడ్ శాంపిల్స్ సేకరించారు. ఇదిలా ఉంటే బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు హాస్య నటి హేమ ఉన్నట్లు వార్తలు గుప్పమన్నాయి. అయితే తనకు రేవ్ పార్టీతో సంబంధం లేదు.. ఆ సమయానికి తాను హైదరాబాద్ లో ఓ ఫామ్ హౌజ్ లో ఉన్నట్లు వీడియో రిలీజ్ చేసింది. మరోవైపు బెంగుళూరు పోలీసులు హేమ రేవ్ పార్టీలో ఉన్నట్లు ఫోటో రిలీజ్ చేశారు. ఇంతకీ హేమ పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? అన్న సందేహంలో ఉన్నారు. తాజాగా హేమ కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగుళూరు రేవ్ పార్టీలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగుళూరు శివారలోని ఫామ్ హౌజ్ లో లో బర్త్ డే పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ జరిగింది. నిన్న బెంగుళూరు లో గోపాల్ రెడ్డి ఫామ్ హౌజ్ పై పోలీసులు దాడి చేసి అక్కడ ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయి చరస్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ ఇండస్ట్రీకి చెందిన సీనీ ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొన్నట్లు కన్నడ మీడియాల కోడై కూసింది.ఈ క్రమంలోనే నటి హేమ, నటుడు శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రేవ్ పార్టీలో ఉన్నారని వార్తలు వచ్చాయి.తమకు రేవ్ పార్టీతో సంబంధం లేదని ఈ ముగ్గురు వీడియో రిలీజ్ చేశారు.

నటి హేమ విషయం ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని బెంగుళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీలో తాను లేను అని రిలీజ్ చేసిన వీడియోలో ఏ డ్రెస్ లో ఉన్నారో.. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. దీంతో అభిమానుల్లో కన్ఫ్యూజ్ మొదలైంది. ఇదిలా ఉంటే నటి హేమ మరో కొత్త వీడియో రిలజ్ చేశారు. ఇన్‌స్ట్రాలో బిర్యానీ వండుతున్న వీడియో పోస్ట్ చేశారు. ఈ రోజు వీడియోలో రేవ్ పార్టీ ఊసే ఎత్తులేదు.. దీంతో ఇది ఈరోజుదేనా? లేక పాత వీడియో పోస్ట్ చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis