iDreamPost
android-app
ios-app

Faria Abdullah: త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఫరియా అబ్దుల్లా.. వరుడెవరంటే?

  • Published Mar 15, 2024 | 4:02 PM Updated Updated Mar 15, 2024 | 4:04 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే? జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోందట. ఇంతకీ ఆమె చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే? జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోందట. ఇంతకీ ఆమె చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Mar 15, 2024 | 4:02 PMUpdated Mar 15, 2024 | 4:04 PM
Faria Abdullah: త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఫరియా అబ్దుల్లా.. వరుడెవరంటే?

ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు మూవీలో ‘చిట్టి’ క్యారెక్టర్ తో కుర్రాళ్ల గుండెలను మెలిపెట్టేసింది. చిట్టి పాత్రకు యూత్ మెుత్తం కనెక్ట్ అయ్యారు. ఇక ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కడతాయని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగింది వేరు. అడపాదడపా మాత్రమే ఛాన్స్ లు ఆమె తలుపుతట్టాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుట్ యాక్టీవ్ ఈ ముద్దుగుమ్మ. బెల్లీ డ్యాన్స్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. చిట్టి త్వరలోనే పెళ్లిచేసుకోబోతోందన్న వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ పెళ్లికొడుకు ఎవరో తెలుసా? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అచ్చతెలుగు హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు తర్వాత కొన్ని సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లో కూడా కనిపించి మెప్పించింది. ప్రస్తుతం అల్లరి నరేష్ తో ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉండగా.. ఫరియా గురించిన ఓ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అదేంటంటే? త్వరలోనే చిట్టి పెళ్లి పీటలెక్కబోతుందట. ఆమె వివాహం చేసుకునేది ఎవరినో కాదట.. తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ నే అని పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది. పైగా అతడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించాడని వినికిడి. అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం డైరెక్ట్ గా ఈ అమ్మడే స్పందించాలి.

అయితే ఫరియా గతంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, రిలేషన్ షిప్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. స్వేచ్ఛగా వరల్డ్ మెుత్తం తిరగాలనుకుంటున్నానని, పెళ్లి, డేటింగ్ లాంటి విషయాలపై పెద్దగా నమ్మకం లేదని చిట్టి చెప్పుకొచ్చింది. ఇలాంటి మాటలు మాట్లాడిన ఫరియాపై పెళ్లి వార్తలు రావడంతో.. ఫ్యాన్స్ అయోమయానికి గురౌతున్నారు. కాగా.. ప్రస్తుతం అల్లరి నరేష్ కు జోడీగా పెళ్లి కాన్సెఫ్ట్ తోనే ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. మరి ఫరియా అబ్దుల్లా పెళ్లి వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

ఇదికూడా చదవండి: Tantra Movie Review: అనన్య నాగళ్ల తంత్ర మూవీ రివ్యూ

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş