iDreamPost
android-app
ios-app

ఆ స్టార్ హీరోకి ఫిమేల్ వెర్షన్! ‘జాతిరత్నాలు’ బ్యూటీ కామెంట్స్ వైరల్!

  • Author ajaykrishna Published - 01:45 PM, Tue - 8 August 23
  • Author ajaykrishna Published - 01:45 PM, Tue - 8 August 23
ఆ స్టార్ హీరోకి ఫిమేల్ వెర్షన్! ‘జాతిరత్నాలు’ బ్యూటీ కామెంట్స్ వైరల్!

‘జాతిరత్నాలు’ మూవీతో టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంది టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాది భామ.. హైట్ తో పాటు తన క్యూట్ యాక్టింగ్ తో ఫస్ట్ మూవీలో అందరిని మెప్పించింది. చిట్టి క్యారెక్టర్ లో అటు కామెడీ పండించిన ఫరియా.. బయట సోషల్ మీడియాలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటిదాకా సినిమాల పరంగా గ్లామర్ జోలికి వెళ్లని ఫరియా.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోతో రచ్చ చేస్తుంటుంది. ముఖ్యంగా ఫరియా డాన్స్ వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. అయితే.. ఫస్ట్ మూవీ జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేసరికి.. ఇండస్ట్రీలో ఫరియా వరుస అవకాశాలతో చాలా బిజీ అయిపోతుందని అంతా అనుకున్నారు.

కట్ చేస్తే.. ఫరియా కెరీర్ విషయంలో ప్రేక్షకులు అంచనాలన్నీ తారుమారైపోయాయి. ఊహించని విధంగా ఎక్కడా ఏ హీరో పక్కన కూడా కొన్నాళ్ళు కనిపించలేదు. అవును.. ఒక సూపర్ హిట్ పడినప్పుడు నెక్స్ట్ స్టెప్ కూడా ఎంతో జాగ్రత్తగా వేయాలని ఎవరైనా ఆలోచిస్తారు. ఫరియా కూడా అలాగే అనుకుందేమో! కానీ.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా.. హిట్స్ పడక కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదని టాక్. ప్రేక్షకులు ఆమె గురించి అలోచించినట్లుగా.. ఆమెకు కొన్ని ఆలోచనలు ఉండవచ్చు. అయితే.. అందం, అభినయంతో పాటు ఆవగింజ అంత అదృష్టం కూడా కలిసి రావాలని ఇండస్ట్రీలో ఎప్పుడూ అంటుంటారు.

ఆ విధంగా చూసుకుంటే చిట్టి టైమ్ ఇంకా రాలేదేమో. ఇదిలా ఉండగా.. సినిమాల నుండి ఇప్పుడు ఓటిటి స్క్రీన్ పై అలరించేందుకు రెడీ అయిపోయింది ఫరియా. దాంతో ‘ది జెంగబూరు కర్స్’ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ చేయనుంది. ఆగష్టు 9 నుండి ఈ వెబ్ సిరీస్.. ప్రముఖ ఓటిటి సోనీలివ్ లో ప్రసారం కాబోతుంది. అయితే.. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్న ఫరియా.. రీసెంట్ గా ఓ స్టార్ హీరోపై క్రేజీ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే.. బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్. అతనికి తాను ఫిమేల్ వెర్షన్ అని అంటోంది అమ్మడు. ఒక్కోసారి దీపికా కన్నా తానే ఎక్కువగా రన్వీర్ కి రిలేటెడ్ గా అనిపిస్తానని తన ఫీలింగ్ బయట పెట్టింది. ప్రస్తుతం ఫరియా మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఫరియా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş