సెలబ్రిటీస్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వారి లగ్జరీ లైఫే. కానీ ఆ సెలబ్రిటీస్ జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. దానికి ఉదాహరణగా టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లనే తీసుకోవచ్చు. ఇక హీరోయిన్లను చూడగానే.. అబ్బా సూపర్ ఉంది అని అనుకుంటారు. కానీ వారి రియల్ లైఫ్ లో ఎన్నో సమస్యలు ఉంటాయి. వారి సమస్యలను పైకి చెప్పుకోలేరు. అయితే ఇటీవల కొందరు హీరోయిన్స్ తమకు ఉన్న వ్యాధుల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ తనకు ఉన్న జబ్బు గురించి సోషల్ మీడియాలో మాస్క్ పెట్టుకున్న పిక్ పెట్టి మరీ పోస్ట్ చేసింది. సమంత తీసుకున్న ట్రీట్ మెంట్ నే ఈ హీరోయిన్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది టాలీవుడ్ బ్యూటీ సమంత. ఈ వ్యాధికి సంబంధించిన చికిత్సను సైతం కొన్ని నెలల ముందు తీసుకుంది సామ్. తాజాగా ఈ అరుదైన వ్యాధి బారినపడినట్లు తెలుస్తోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈషా గుప్తా. తాజాగా ఈషా గుప్తా తన ఇన్ స్టా స్టోరీలో ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ఇక ఆ పోస్ట్ కు హైపర్బేరిక్ థెరపీ అనే క్యాప్షన్ ను పెట్టింది. దాంతో సమంతకి వచ్చిన అరుదైన వ్యాధే ఈమెకు కూడా వచ్చిందని అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే మయోసైటిస్ థెరపీలో భాగంగా ఇదే ట్రీట్ మెంట్ ను తీసుకుంది సామ్. ఈ ట్రీట్ మెంట్ ద్వారా పాడైన కండరాలు బాగుపడతాయని, వాపు, ఇన్ఫెక్షన్ తగ్గుతాయని సమంత అప్పట్లో చెప్పుకొచ్చింది.
కాగా.. ఇప్పుడు ఈషా గుప్తా అలాంటి మాస్క్ ధరించడంతో ఈమెకు కూడా మయోసైటిస్ వచ్చిందా? అనే సందేహం కలుగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈషా.. తెలుగు తెరపై కూడా కనిపించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాలో ‘ఏక్ బార్ ఏక్ బార్’ అనే పాటకు చరణ్ తో కలిసి స్టెప్పులు వేసింది. ఈ పాటలో తన అందం, డ్యాన్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కించింది ఈషా గుప్తా. ఇక సచిన్ జోషి హీరోగా నటించిన ‘వీడెవడు’ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. తెలుగులో ఈ రెండు సినిమాల తర్వాత ఈ అమ్మడుకు అనుకున్నంతగా ఛాన్స్ లు రాలేదు. దాంతో బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. మరి ఈ బ్యూటీకి వచ్చిన జబ్బు ఏంటో.. ఆమె కోలుకున్నాక చెబితే కాని తెలియదు.
ఇదికూడా చదవండి: వీడియో: BB షైనింగ్ స్టార్స్.. శ్రీహాన్- సిరి ఊర మాస్ డ్యాన్స్!