లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న పొలిమేర నటి.. నామినేషన్‌ దాఖలు

ఎన్నికల్లో సినీతారలు పోటీపడుతున్నారు. ఇప్పటికే పలువురు తారలు రాజకీయాల్లోకి రాగా ఇప్పుడు మరో నటి ఆ లిస్టులో చేరింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పొలిమేర నటి రెడీ అయ్యింది.

ఎన్నికల్లో సినీతారలు పోటీపడుతున్నారు. ఇప్పటికే పలువురు తారలు రాజకీయాల్లోకి రాగా ఇప్పుడు మరో నటి ఆ లిస్టులో చేరింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పొలిమేర నటి రెడీ అయ్యింది.

దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లీడర్లు ప్రజల్లో కలియతిరుగుతున్నారు. నేతలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. కాగా లోక్ సభ ఎన్నికలు ఏడు విడతలుగా జరుగనున్నాయి. కాగా ఇప్పటికే మొదటి దశ పోలింగ్ ముగిసిపోయింది. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ జరుగనున్నది. ఇక ఈ ఎన్నికల్లో పేరుమోసిన బడా లీడర్ల దగ్గర్నుంచి మొదలుకొని సినీ స్టార్లు, సోషల్ మీడియా ఇన్ల్పూయెన్సర్లు, సామాన్యుల వరకు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. కాగా ఇప్పటి వరకు పలువురు సినీఇండస్ట్రీకి చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటి ఆ జాబితాలో చేరారు.

సినిమారంగంలోని నటీనటులు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. సమాజానికి తమ వంతు సాయమందించేదుకు రాజకీయాలను ఎంచుకుంటున్నారు. పలువురు నటీనటులు ఏకంగా సొంతంగా పార్టీలు పెట్టి రాజకీయాలు శాసించాలని చూస్తుంటే మరికొందరు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగానో లేదా ఎంపీగానో గెలవాలని తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలో ‘పొలిమేర’ సిరీస్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి లోక్‌సభ ఎన్నికల బరిలో పోటీపడనున్నారు.

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా ఆమె బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్‌ సమర్పించారు. చేవేళ్ల నుంచి భాజపా తరపున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రంజిత్‌రెడ్డి పోటీ చేస్తుండగా, భారాస నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ పోటీలో ఉన్నారు. కాగా ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాల్లో సాహితి తన నటనతో ఆడియెన్స్ ను మెప్పించారు.

Show comments