iDreamPost
android-app
ios-app

విడాకుల వార్తలపై స్పందించిన కలర్స్ స్వాతి!

  • Author Soma Sekhar Published - 09:21 PM, Tue - 25 July 23
  • Author Soma Sekhar Published - 09:21 PM, Tue - 25 July 23
విడాకుల వార్తలపై స్పందించిన కలర్స్ స్వాతి!

కలర్స్ స్వాతి.. గత కొన్ని రోజులుగా వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు. దానికి కారణం ఆమె ఏ స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిందనుకుంటే పొరపడినట్లే. ఈ పేరు న్యూస్ లో ట్రెండింగ్ లో ఉండటానికి మెయిన్ రీజన్ తన భర్త వికాస్ తో విడాకులు తీసుకోబోతుందన్న వార్తలే. ఈ డైవర్స్ వార్తలు ఆ నోటా.. ఈ నోటా పడి చివరికి స్వాతి దగ్గరికి చేరినట్లున్నాయి. దాంతో విడాకుల వార్తలపై స్పందించింది ఈ చిన్నది. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన డైవర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

కలర్స్ స్వాతి.. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగమ్మాయి అయినప్పటికీ తెరంగేట్రం మాత్రం ‘సుబ్రహ్మణ్యపురం’ అనే తమిళ మూవీతో చేసింది. తెలుగులో అష్టాచమ్మా, స్వామిరారా, కార్తికేయ సినిమాలు నటిగా స్వాతికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే బిజినెస్ మెన్ అయిన వికాస్ ను పెళ్లి చేసుకుని ఫారిన్ కు చక్కేసింది. దాంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది ఈ అమ్మడు.

ఇక గతేడాది ‘పంచతంత్రం’ అనే సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మంత్ ఆఫ్ మధు, చిత్ర అనే షార్ట్ ఫిల్మ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వాతి తన భర్త నుంచి విడాకులు తీసుకుంటోందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించింది స్వాతి. విడాకుల రూమర్స్ నిజమేనా అని ఓ ప్రముఖ మీడియా హౌస్ అడగ్గా.. చెప్పడానికి ఏం లేదు. అలాంటివి ఉంటే నేనే చెప్తాను అంటూ విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టింది ఈ సుందరి. కాగా.. స్వాతి విడాకులకు సంబంధించి ఇలా వార్తలు రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2020లో కూడా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఇప్పటిలాగే ఖండించింది స్వాతి.

ఇదికూడా చదవండి: చిరంజీవికి ఊరట.. ఆ కేసును కొట్టివేసిన ఏపీ హైకోర్టు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet