iDreamPost
android-app
ios-app

Chitra shukla: పోలీస్ ను పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్! పిక్స్ వైరల్..

  • Author Soma Sekhar Published - 09:01 AM, Wed - 6 December 23

తాజాగా ఓ తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. బిజినెస్ మెన్, యాక్టర్ ను కాకుండా ఓ పోలీస్ ను ఈ అమ్మడు వివాహం ఆడనుంది.

తాజాగా ఓ తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. బిజినెస్ మెన్, యాక్టర్ ను కాకుండా ఓ పోలీస్ ను ఈ అమ్మడు వివాహం ఆడనుంది.

  • Author Soma Sekhar Published - 09:01 AM, Wed - 6 December 23
Chitra shukla: పోలీస్ ను పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్! పిక్స్ వైరల్..

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సాధారణ ప్రజలతో పాటుగా సెలబ్రిటీలు కూడా వైవాహిక జీవితాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే తమ జీవిత భాగస్వామిని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. బిజినెస్ మెన్, యాక్టర్ ను కాకుండా ఓ పోలీస్ ను ఈ అమ్మడు వివాహం ఆడనుంది. మరో రెండు రోజుల్లో ఈ ముద్దుగుమ్మ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిక్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మరి పోలీస్ ను లగ్గం ఆడనున్న ఆ బ్యూటీ ఎవరు? ఇప్పుడు చూద్దాం.

చిత్రశుక్లా.. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ అమ్మడు 2014లో ‘ఛల్ భాగ్’ అనే హిందీ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. పులి, నేను శైలజ మూవీల్లో సైడ్ డ్యాన్సర్ గా కనిపించింది ఈ చిన్నది. ఈ క్రమంలోనే 2016లో హీరో శ్రీవిష్ణు నటించిన ‘మా అబ్బాయి’ చిత్రంతో హీరోయిన్ గా మారిపోయింది. తర్వాత వరుసగా ‘రంగుల రాట్నం’, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో క్రమంగా మూవీలకు దూరంగా ఉంటూ వచ్చింది.

ఈ క్రమంలోనే వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో క్లోజ్ గా ఉన్న పిక్స్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుండేది. దీంతో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ.. డిసెంబర్ 8 మూడు ముళ్ల బంధంతో వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. తాజాగా హల్దీ, మెహందీ సెలబ్రేషన్స్ ముగిసిపోయాయి. కాబోయే భర్తతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా.. వైభవ్ మధ్యప్రదేశ్ లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రముఖులు, నెటిజన్లు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికై ఈ బ్యూటీ చేతిలో కొత్త మూవీలు ఏమీ లేవు. దీంతో పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేస్తుందని అందరూ అనుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Chitra Shukla (@chitrashuklaofficial)

 

View this post on Instagram

 

A post shared by Chitra Shukla (@chitrashuklaofficial)

 

View this post on Instagram

 

A post shared by Chitra Shukla (@chitrashuklaofficial)