iDreamPost
android-app
ios-app

పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్ కేథరీన్! వరుడు ఎవరంటే?

  • Author ajaykrishna Updated - 03:36 PM, Tue - 18 July 23
  • Author ajaykrishna Updated - 03:36 PM, Tue - 18 July 23
పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్ కేథరీన్! వరుడు ఎవరంటే?

కొన్నాళ్ళుగా సినీ తారలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఎవరెవరు అనేది మాత్రం చాలా సడన్ గా అనౌన్స్ చేస్తున్నారు. జనాలకు కాదు కదా.. సెలబ్రిటీలు పెళ్లి చేసుకోబోతున్నట్లు వాళ్ల ఫ్యాన్స్ కి కూడా తెలియట్లేదు. అంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్స్ జరిగిపోతున్నాయి. ఆ తర్వాత చాలా రోజుల గ్యాప్ తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. అయితే.. కొందరి విషయంలో మాత్రం పెళ్లి గురించి నెక్స్ట్ లెవల్ లో ప్రచారాలు గట్టిగా జరుగుతుంటాయి. ప్రెజెంట్ ఓ హీరోయిన్ గురించి అలాంటి ప్రచారమే జరుగుతోంది. ఆ బ్యూటీ ఎవరో కాదు కేథరీన్ థ్రెసా.

దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న కేథరిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో, సరైనోడు లాంటి బిగ్ హిట్స్ లో నటించిన ఈ భామ.. వరుసగా గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి, బింబిసార లాంటి మూవీస్ తో తన ఫామ్ ని రేర్ గా కంటిన్యూ చేసింది. దుబాయ్ లో పుట్టిపెరిగిన కేథరీన్.. హైయర్ స్టడీస్ కోసం బెంగుళూరులో అడుగుపెట్టింది. అలా 2010లో ‘శంకర్ ఐపీఎస్’ అనే మూవీతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మలయాళంలో డెబ్యూ చేసి.. తర్వాత తెలుగులోకి వచ్చింది. ఇంకేముంది తెలుగులో డెబ్యూ మూవీనే సూపర్ క్రేజ్ తెచ్చేసరికి అవకాశాలు వచ్చాయి. కానీ.. కావాల్సిన బిగ్ బ్రేక్ రాలేదు.

చేసేదేం లేక తమిళంలో తన అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ కూడా హిట్స్ ప్లాప్స్ అన్నట్లుగా కెరీర్ సాగించింది. చివరిగా కేథరీన్.. బింబిసారతో హిట్ కొట్టింది. కానీ.. ఆ హిట్ క్రెడిట్ అంతా హీరో కళ్యాణ్ రామ్ ఖాతాలో పడింది. ఈ ఏడాది వాళ్తేరు వీరయ్య మూవీలో చిన్న రోల్ చేసాక మళ్లీ కొత్త మూవీ అనౌన్స్ చేయలేదు. ఈ క్రమంలో కేథరీన్ కి సంబంధించి పెళ్లి వార్తలు బయటికి వచ్చాయి. అవును.. కేథరీన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ప్రస్తుతం అమ్మడి వయసు 33 ఏళ్లు. తన చిన్ననాటి స్నేహితుడినే.. తన కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసుకోనుందట కేథరీన్. ఈ ఏడాదిలోనే ఈ భామ పెళ్లి చేసుకుంటుందని సమాచారం. దీనిపై కేథరీన్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సో.. కేథరీన్గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş