iDreamPost
android-app
ios-app

ఆస్పత్రిలో ప్రముఖ నటి.. నరకం అనుభవించా అంటూ పోస్ట్!

  • Published Nov 23, 2023 | 12:20 PM Updated Updated Nov 23, 2023 | 12:20 PM

ఈ మద్య కాలంలో పలువురు సినీ తారలు పలు కారణాలతో ఆస్పత్రిలో చేరడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం తీవ్ర ఆందోళనకు గురైతున్నారు. ఆస్పత్రి నుంచి సెల్ఫీలు పంపించడంతో అభిమానులు ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

ఈ మద్య కాలంలో పలువురు సినీ తారలు పలు కారణాలతో ఆస్పత్రిలో చేరడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం తీవ్ర ఆందోళనకు గురైతున్నారు. ఆస్పత్రి నుంచి సెల్ఫీలు పంపించడంతో అభిమానులు ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

  • Published Nov 23, 2023 | 12:20 PMUpdated Nov 23, 2023 | 12:20 PM
ఆస్పత్రిలో ప్రముఖ నటి.. నరకం అనుభవించా అంటూ పోస్ట్!

ఇటీవల సిని ఇండస్ట్రీలో పలువురు నటీనటులు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలవుతున్న విషయం తెలిసిందే. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు గుండెపోటుకు గురి కావడం, క్యాన్సర్ భారిన పడటం ఇలా పలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ భారీన పడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి డెంగ్యూ భారిన పడి ఆస్పత్రిలో చేరింది. తాను ఆస్పత్రిలో ఉన్నంత వరకు నరకం అనుభవించానంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఆస్పత్రిలో చేరింది. నవంబర్ 22న ఉదయం తన ఇన్ స్ట్రా వేధికగా తనకు డెంగ్యూ ఉన్నట్లు నిర్దారణ అయ్యిందని వెల్లడించింది. ఈ సందర్బంగా పెడ్నేకర్ హాస్పిటల్ తన బెడ్ పై నుంచి ఒక సెల్ఫీ అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్ లో ‘ నాకు కొన్ని రోజులు కఠినంగా ఉండబోతున్నాయిన’ అంటూ వెల్లడించింది. ఈ సందర్బంగా ‘ఒక చిన్న దోమ నాకు ఎనిమిది రోజులు నరకం చూపించింది. ఈ రోజు కాస్త రిలీఫ్ అయ్యాను.. అందుకే ఒక సెల్ఫీతో మీ ముందుకు వచ్చాను. నా అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడ్డారు.. దోమల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోండి.. ప్రస్తుతం కాలుష్యం వల్ల మనలో రోగనిరోధక శక్తి సన్నగిల్లిపోతుంది.. నాకు తెలిసిన వారు కూడా కొంతమంది డెంగ్యూ భారిన పడి చికిత్స పొందుతున్నారు. కంటికి కపించని వైరస్ నా పరిస్థితి దిగజార్చింది’ అంటూ తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. నేను ఆసుపత్రిలో ఉన్నంత వరకు కంటికి రెప్పలా చూసుకున్న వైద్యులు, ఆస్పత్రి సిబ్బందికి ధన్యవాదాలు అని తెలిపింది.

భూమి పెడ్నేకర్ మూవీస్ విషయానికి వస్తే.. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ‘దమ్ లగా కె హైషా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలంగా ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ పడ్నేకర్ కి సరైన బ్రేక్ రాలేదు. ఇటీవల ఆమె నటించిన ‘థాంక్యూ ఫర్ కమింగ్’ కాస్త పరవాలేదు అనిపించింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఈ మధ్య భూమి పడ్నేకర్,అర్జున్ కపూర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ది లేడీ కిల్లర్’ రిలీజ్ అభిమానులను బాగా అలరిస్తుంది. అర్జున్ కపూర్, రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న మరో చిత్రంలో భూమి పెడ్నేకర్ నటిస్తుంది.. ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది. పెడ్నేకర్ పోస్ట్ చూసి అభిమానులు ఆమె ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Bhumi Pednekar (@bhumipednekar)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap