iDreamPost
android-app
ios-app

విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్ ఆసిన్?

  • Author Soma Sekhar Published - 12:14 PM, Tue - 27 June 23
  • Author Soma Sekhar Published - 12:14 PM, Tue - 27 June 23
విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్ ఆసిన్?

ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్ళు, డేటింగ్ లు, విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే త్వరగా విడాకులు తీసుకుంటున్నాయి కొన్ని జంటలు. ఇక మరికొన్ని జంటలు మాత్రం కొన్ని సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత విడాకులు తీసుకోవడం గమనార్హం. తమ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని విడాకులు తీసుకుంటున్నారు చాలా మంది సెలబ్రిటీలు. తాజాగా తమిళ స్టార్ హీరోయిన్ ఆసిన్ కూడా విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఆసిన్.. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తన అందంతో, నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రవితేజ లాంటి స్టార్ హీరోలకు జోడీగా నటించి సూపర్ హిట్లు కొట్టింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సైతం ఓ సినిమాలో మెరిసింది. అయితే సూర్య హీరోగా నటించిన గజిని సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ స్టార్ డమ్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే 2016లో వ్యాపార వేత్త రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది ఆసిన్. పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య కొంత కాలంగా మనస్పర్థలు వస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం వేరే అమ్మాయితో రాహుల్ కు ఎఫైర్ ఉన్నట్లు ఆసిన్ కు తెలిసిందట. దాంతో అప్పటి నుంచి అతడికి దూరంగా ఉంటోందట ఆసిన్. ఇక వీరికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం ఆసిన్ పాపతో వేరే ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాహుల్ తో విడాకులు తీసుకోవాలనుకుంటుందట ఆసిన్. ప్రస్తుతం ఆసిన్ విడాకులు తీసుకోబోతోంది అన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి విడాకుల వార్తలపై ఆసిన్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibom