iDreamPost
android-app
ios-app

వెంటిలేటర్ పై నటి.. ఇప్పటికే 40 లక్షలు ఖర్చు.. ఆదుకోమంటూ అభ్యర్థన

  • Published Apr 04, 2024 | 9:46 AM Updated Updated Apr 04, 2024 | 9:46 AM

ఇటీవల ఓ ప్రముఖ సినీ హీరోయిన్ అరుంధతి నయ్యర్ యాక్సిడెంట్ కు గురైందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఆరోగ్యానికి సంబంధించి మరి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.

ఇటీవల ఓ ప్రముఖ సినీ హీరోయిన్ అరుంధతి నయ్యర్ యాక్సిడెంట్ కు గురైందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఆరోగ్యానికి సంబంధించి మరి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.

  • Published Apr 04, 2024 | 9:46 AMUpdated Apr 04, 2024 | 9:46 AM
వెంటిలేటర్ పై నటి.. ఇప్పటికే 40 లక్షలు ఖర్చు.. ఆదుకోమంటూ అభ్యర్థన

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పని చేసేవారంటే.. అందరు వారికి ఎంతో డబ్బు ఉంటుంది. వారికేంటిలే చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారని భావిస్తూ ఉంటారు, కానీ తెర వెనుక .. ఆ మేకప్ వెనుక వారు బ్రతికే బ్రతుకులు వేరు. ఎంతో మంది ఎన్నో కష్టాలను ఎదుర్కొంటు ఉంటారు. దాని గురించి మాత్రం ఎవరు ఆలోచించారు. వారు ఆపదలో ఉండి వారంతట వారుగా .. చెప్పుకుంటే తప్ప ఎవరికీ ఈ విషయాలు తెలియవు. ఈ క్రమంలోనే.. ఓ సినీ నటి.. అరుంధతి నయ్యర్ ఒక రోడ్ యాక్సిడెంట్ కు గురైందన్న వార్తను విన్నాము. ఆమె ఆరోగ్యానికి ఇంకా కుదుటపడలేదని.. చేతిలో డబ్బులు లేవు సాయం చేయండి అంటూ.. మరికొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ .. ఇలా ఉన్నాయి.

ఇటీవల అరుందతి స్కూటీ పైన వెళ్తూ.. రోడ్ యాక్సిడెంట్ కు గురయ్యి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుందనే వార్తను విన్నాము. ఇప్పటివరకు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె ప్రస్తుతం తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. వెంటిలేటర్ సాయహం తనే శ్వాస తీసుకుంటోంది. కనీసం రోజుకి 2లక్షల వరకు ఖర్చు అవుతోందని.. ఇప్పటికే ఆమె కుటుంబం 40లక్షల వరకు ఖర్చు చేసారని డాక్టర్స్ చెబుతున్నారు. యాక్సిడెంట్ జరిగినపుడు.. ఆమె తలకు, వెన్నుముకకు బలంగా గాయాలు అవ్వడంతో.. ఆమె కోలుకోవడానికి మరింత సమయం, మరిన్ని చికిత్సలు అవసరం అని.. డాక్టర్స్ వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు ఆర్ధిక సహాయం కోసం మీడియా ముందుకు వచ్చారు.

90 రోజులు దాటినా కూడా ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారని.. విరిగిన పక్కటెములకు కూడా చికిత్స చేయవలసి ఉంటుందని కాబట్టి.. ఆర్ధికంగా సహాయం చేయాలనీ ఆమె సోదరి ఆర్తి నాయర్ మీడియాతో విన్నవించుకున్నారు. ఈమె కోసం ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమె స్నేహితులు.. క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టారు. ఇంకా ఆమె అభిమానులు కూడా అరుందతి నాయర్ త్వరగా కోలుకోవాలని భావిస్తున్నారు. అరుందతి సోదరి ఆర్తి నాయర్ కూడా చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో అరుంధతికి సహాయం చేయలని ఆమె కోరుతున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet