iDreamPost
android-app
ios-app

‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ నటి మృతి!

  • Published Nov 06, 2023 | 2:00 PM Updated Updated Nov 06, 2023 | 2:00 PM

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా తమ అభిమాన నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా తమ అభిమాన నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు.

  • Published Nov 06, 2023 | 2:00 PMUpdated Nov 06, 2023 | 2:00 PM
‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ నటి మృతి!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటీనటులు, దర్శక-నిర్మాతలు, ఇతర సాంకేతిక వర్గానికి సంభందించిన వారు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. కొంతమంది సెలబ్రెటీలు వృద్దాప్య కారణంగా చనిపోతే మరికొంతమంది గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, బలవన్మరాణాలు ఇలా పలు కారణాల వల్ల చనిపోతున్నారు. ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. ఎన్నో సీరియల్స్, సినిమాల్లో నటించిన ఆయన మిచిగాన్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లి అక్కడే కన్నుమూశారు. ఈ విషాద ఘటన మరువక ముందే బాలీవుడ్ లో ప్రముఖ నటి కన్నుమూయడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.

బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సీరియల్స్ వచ్చాయి.. అందులో ఇప్పటికీ గుర్తుంచుకోదగ్గ సీరియల్స్ లో ‘సాథ్ నిభానా సాథియా’ ఒకటి. బుల్లితెరపై ‘బా’ అనే అమ్మమ్మ పాత్రతో మంచి పాపులారిటీ సంపాదించిన ప్రముఖ నటి అపర్ణా కనేకర్.. 83 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. కోకిలా బెన్, గోపి బహు, రాశి బహు, అహమ్ జీ, జిగర్ లాంటి సీరియల్స్ లో నటించిన అపర్ణా కనేకర్ ‘సాథ్ నిభానా సాథియా’ సీరియల్ తో మంచి పేరు సంపాదించారు. బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా ఆమె సత్తా చాటారు. 2013లో ప్రియా కృష్ణస్వామి దర్శకత్వంలో   నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్మించిన ‘గుంగూబాయి’ మూవీలో ఆమె మలన్ బాయి పాత్రతో బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించింది.

అపర్ణా కనేకర్ మరణం పై సీరియల్ నటి లవ్లీ ససన్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో అపర్ణ చెంపపై లవ్లీ ముద్దు పెడుతుండగా.. చిరునవ్వు చిందిస్తూ ఉంది. ఈ ఫోటో క్యాప్షన్ ఇచ్చింది, ‘ఈ రోజు నా గుండె చాలా బరువెక్కినట్లు అనిపిస్తుంది. నాకు ఎంతో ఇష్టమైన గొప్ప నటి ఇక లేదు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నా.. ఆమె నాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. సెట్స్ లో ఆమెతో గడిపిన సమయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దేవుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నా.. ప్రియమైన బా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి’ అంటూ పోస్ట్ చేసింది. అపర్ణ కనేకర్ మరణ వార్త వివి టీవీ, సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. పలువురు నటీనటులు ఆమెకు నివాళులర్పించారు.

 

View this post on Instagram

 

A post shared by Lovey Sasan (@loveysasan)

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş