iDreamPost
android-app
ios-app

ఆడిషన్ అంటూ 10 మందితో అలా చేయమన్నారు: స్టార్‌ హీరోయిన్‌

  • Published Apr 23, 2024 | 9:30 PM Updated Updated Apr 23, 2024 | 9:30 PM

Star Heroine Comments: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగ చెప్పనక్కరలేదు. ఇండస్ట్రీలో నటిగా రాణించాలంటే దర్శక, నిర్మాతలు కోరిక తీర్చాల్సిందే.. లేదంటే చాన్సులు ఉండవని ఎంతోమంది నటీమణులు ఇటీవల తమ గళం విప్పుతున్నారు.

Star Heroine Comments: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగ చెప్పనక్కరలేదు. ఇండస్ట్రీలో నటిగా రాణించాలంటే దర్శక, నిర్మాతలు కోరిక తీర్చాల్సిందే.. లేదంటే చాన్సులు ఉండవని ఎంతోమంది నటీమణులు ఇటీవల తమ గళం విప్పుతున్నారు.

  • Published Apr 23, 2024 | 9:30 PMUpdated Apr 23, 2024 | 9:30 PM
ఆడిషన్ అంటూ 10 మందితో అలా చేయమన్నారు: స్టార్‌ హీరోయిన్‌

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే అందం, అభినయం మాత్రమే కాదు మంచి నటన ఉండాలి. చిత్ర పరిశ్రమలోకి రావడం అంటే అంత ఆశామాశీ వ్యవహారం కాదు. సినిమాల్లోకి రావడానికి ముందు నటీనటులకు ఆడీషన్ నిర్వహిస్తారు.. అందులో వారు సంతృప్తి చెందితే ఛాన్సులు ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే కొంతమంది దుర్మార్గులు సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామని, ఆడిషన్ పేరుతో లైంగిక దాడులు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల మీటూ ఉద్యమం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది నటీమణులు గతంలో తమపై జరిగి క్యాస్టింగ్ కౌచ్ పై గళం విప్పుతున్నారు. తాజాగా ఓ నటి తనకు జరిగిన పరాభవం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

బుల్లితెర, వెండితెరపై ఎంట్రీ ఇవ్వాలంటే ముందుగా ఆడిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆడిషన్స్ సందర్భంగా దర్శక, నిర్మాతలను మెప్పిస్తే సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తుంది. తమకు సినిమా ఛాన్స్ కావాలంటే ఒక్కోక్కరికి ఒక్కో టాస్క్ ఇస్తుంటారు. భారీ డైలాగ్స్, ఎమోషన్స్, డ్యాన్స్ ఇలా ఎన్నో రకాలుగా తమలో ఉన్న పతిభను గుర్తించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తుంటారు. కొంతమంది ఆడీషన్స్ పేరుతో అమ్మాయిల ఎమోషన్స్ తో ఆడుకుంటారని ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హత్వే ఓ ఇంటర్వ్యూలో తన గతాన్ని గుర్తు చేసుకొని బాధపడింది. ఇండస్ట్రీలో రాణించడానికి అందం, అభినయం మాత్రమే సరిపోదు.. ఎన్నో అవమానలు, బాధలు ఎదుర్కునే మానసిక ధైర్యం కూడా ఉండాలని అన్నే హత్వే తన అభిప్రాయం వ్యక్తం చేసింది. తన కొత్త చిత్రం ‘ ది ఐడియా ఆఫ్ యు’ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో మే 2 న విడుదల కానుంది.. ఈ క్రమంలో హాలీవుడ్ మ్యాగజైన్ తో మాట్లాడింది.

star heroines

ఇంటర్వ్యూలో అన్నే హత్వే మాట్లాడుతూ.. ‘ కెరిర్ బిగినింగ్ లో నేను ఓ సినిమా ఆడిషన్ కి వెళ్లాను.. హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూపించాలంటూ అక్కడికి వచ్చిన పది మంది అబ్బాయిలని ముద్దు పెట్టుకోమన్నారు. ఒకరినొకరు ముద్దు పెట్టుకునే క్రమంలో కెమిస్ట్రీ ఎలో ఉంటుందో అడగడం సాధారణం. కానీ.. పది మందిని ఒకేసారి ముద్దు పెట్టుకోమనడం సరైన పద్దతి కాదు. అప్పటికీ నేను వయసులో చిన్నదాన్నే.. కష్టమైనప్పటికీ ప్రతీదీ వదిలేస్తే జీవితంలో ఎందులోనూ ముందుకు పోలేం అన్న ఆలోచనతో ఉండేదాన్ని.. అదే థీమ్ తో వారి ముందు నటించా’ అని అన్నారు. కాకపోతే ఏ సినిమా కోసం ఆ ఆడిషన్ జరిగిన విషయం వెల్లడించలేదు. టీవీ సీరియల్ లో నటిగా కెరీర్ ప్రారంభించిన అన్నే హత్వే 2001 లో వచ్చిన ‘ది ప్రిన్సెస్ డైరీస్’ తో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి స్టారో నటిగా పేరు తెచ్చుకుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş