iDreamPost
android-app
ios-app

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన Bigg Boss.. హౌస్ లోనే విడాకులు!

  • Published Dec 21, 2023 | 1:48 PM Updated Updated Dec 21, 2023 | 1:48 PM

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది. అయితే ఇప్పుడు ఈ షో కారణంగా ఓ జంట విడాకులు తీసుకోబోతున్నారు. అసలు ఏం జరిగిందంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది. అయితే ఇప్పుడు ఈ షో కారణంగా ఓ జంట విడాకులు తీసుకోబోతున్నారు. అసలు ఏం జరిగిందంటే?

  • Published Dec 21, 2023 | 1:48 PMUpdated Dec 21, 2023 | 1:48 PM
పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన Bigg Boss.. హౌస్ లోనే విడాకులు!

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో కాలంగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ షో పై ప్రశంసలకన్నా విమర్శలే ఎక్కువగా వస్తుంటాయి. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ముఖ్యంగా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రన్నరప్ నిలిచిన అమర్ దీప్ కారుపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఏకంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు.

ఈ వివాదం పై పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించి విషయం తెలిసిందే. కాగా, ఈ బిగ్ బాస్ రియాల్టీ షో అనేది అటు తెలుగుతో పాటు హిందీ, తమిళ్ కన్నడంలోనూ ప్రసారమవుతోంది. ఈ షో చాలమంది కంటెస్టెంట్స్ ను దగ్గర చేస్తూ లవర్స్ ను చేస్తోంది, కొంతమందిని మంచి స్నేహితులను చేస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది ప్రేమికులను విడదీస్తుంది. కానీ, ఇప్పుడు బిగ్ బాస్ కారణంగా ఏకంగా ఓ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

hindi big boss ankitha lokande

ప్రతిఒక్కరికి వైవాహిక బంధం అనేది చాలా ప్రత్యేకమైనది. అలాంటి పవిత్రమైన బంధన్నీ బిగ్ బాస్ పుణ్యమంటూ.. ఓ జంట విడాకుల వైపు పరుగులు పెడుతోంది. రెండేళ్ల వారి వైవాహిక బంధంలో బిగ్‏బాస్ షో కాస్తా చిచ్చుపెట్టింది. ఇంతకీ ఆ జంట ఎవరంటే.. బాలీవుడ్ బుల్లితెర ఫేమస్ నటి అంకితా లోఖండే, విక్కీ జైన్. అకింతా లోఖండే గురించి హిందీ బుల్లితెర ప్రేక్షకులకు తెలిసిందే. ఆమె పవిత్ర రిష్తా అనే సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది. అదే సమయంలో సహ నటుడు దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమాయణం, ఆ తర్వాత బ్రేకప్ తో తరుచుగా వార్తల్లో నిలిస్తుండేది.

కాగా, అంకితా లోఖండే డిసెంబర్ 2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్ ను వివాహం చేసుకుంది. ఇటీవలే ఈ జంట అక్టోబర్ లో బిగ్ బాస్ సీజన్ 17 హౌస్ లోకి అడుగుపెట్టారు. అలా హోస్ లోకి అడుగు పెట్టిన మొదలు ఇప్పటి వరకు తరుచుగా వీరిద్దరి మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తన భార్య అంకితా పట్ల విక్కీ చిన్నచూపు చూడటం, ఇతర కంటెస్టెంట్స్ మధ్య తన భార్యను అవమానించడంపై ఇప్పటికే విక్కీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తన భర్త విక్కీని అంకితా విడాకులు కావాలని కోరింది.

అసలు ఏం జరిగిదంటే.. బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్ అయేషా ఖాన్, విక్కీ వైవాహిక జీవితం, ప్రేమ, పెళ్లి గురించి చెప్పాలని కోరింది. దీంతో విక్కీ మాట్లాడుతూ.. వివాహితుడు ఎదుర్కొనే బాధల గురించి సరదాగా చెప్పాడు. దీంతో అంకితా చాలా బాధపడింది. తమ వైవాహిక జీవితం ఎందుకు సరిగ్గా లేదని అంకితా తన భర్తను అడగ్గా.. పెళ్లి తర్వాత పురుషులు ఎన్ని బాధలు భరిస్తున్నా ఎప్పుడూ బయటకు చెప్పలేరు అని అన్నాడు. అతని మాటలకు కంగుతిన్న అంకిత వెంటనే తన భర్త నుంచి విడాకులు కావాలని కోరింది. దీంతో కంటెస్టెంట్స్, అడియన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఇది చూసిన ప్రేక్షకులు మరో జంట ఈ బిగ్ బాస్ షో వల్ల విడాకులు తీసుకోబోతుందని విమర్శిస్తున్నారు. మరి, బిగ్ బాస్ కారణంగా విడాకులు తీసుకుంటున్న ఈ జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss