iDreamPost
android-app
ios-app

వీడియో: హీరోయిన్ తండ్రి మృతి.. పాడె మోస్తూ ఏడ్చిన నటి

  • Published Aug 13, 2023 | 5:17 PM Updated Updated Aug 13, 2023 | 5:17 PM
  • Published Aug 13, 2023 | 5:17 PMUpdated Aug 13, 2023 | 5:17 PM
వీడియో: హీరోయిన్ తండ్రి మృతి.. పాడె మోస్తూ ఏడ్చిన నటి

ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. శనివారం బాలీవుడ్ నటి అంకిత లోఖండే తండ్రి శశికాంత్ లోఖండే (68) కన్నుమూశారు. తండ్రి మరణవార్త తెలుసుకుని అంకిత తట్టుకోలేకపోయింది. ఇక ఆదివారం ముంబైలో కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు అంత్యక్రియల్లో పాల్గోన్నారు. అయితే తండ్రి పాడె మోస్తూ ఆయనతో గడిపిన మధుర క్షణాలను తలుచుకుని నటి అంకిత లోఖండే కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఈ సన్నివేశాన్ని చూసి బంధువులు కన్నీటికి లోనయ్యారు.

నటి అంకిత లోఖండే మొదట్లో టెలివిజన్ లో పని చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకులు దగ్గరైంది. ఇక సినిమాల్లో అడుగుపెట్టిన కొన్నాళ్లకే సుషాంత్ సింగ్ తో రిలేషన్ లో కొనసాగింది. ఏం జరిగిందో ఏమో కానీ.. ఆరేళ్ల తర్వాత అంకిత సుషాంత్ సింగ్ తో విడిపోయింది. అనంతరం ఆమె 2021లో విక్కీ జైన్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ ఇప్పుడు చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఆమె తండ్రి మరణించడంతో ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా నటి అంకిత లోఖండే తండ్రి పాడె మోస్తున్న వీడియో పలువురిని కంటతడి పెట్టిస్తుంది.

ఇది కూడా చదవండి: రజినీకాంత్ జైలర్ బాక్సాఫీస్ ఊచకోత.. అన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తూ..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet