iDreamPost
android-app
ios-app

ఆ హీరోతో గొడవలపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ అంకిత!

  • Published Jul 14, 2023 | 1:05 PM Updated Updated Jul 14, 2023 | 1:05 PM
  • Published Jul 14, 2023 | 1:05 PMUpdated Jul 14, 2023 | 1:05 PM
ఆ హీరోతో గొడవలపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ అంకిత!

2002లో వచ్చిన ‘లాహిరిలాహిరిలాహిరిలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అంకిత. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రిలో సెకండ్ హీరోయిన్‌గా నటించారు. సింహాద్రి సినిమాలో ఆమె నటనకు గాను మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత మెయిన్‌ లీడ్‌గా కూడా పలు సినిమాలు చేశారు. అప్పటి యంగ్‌ హీరోలందరితోనూ ఆమె స్క్రీన్‌ను షేర్‌ చేసుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేశారు.

అయితే, అందం, అభినయం ఉన్నప్పటికీ.. ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. 2009లో ఆమె సినిమాలకు దూరం అయ్యారు. చివరగా తెలుగులో పోలీస్‌ అధికారి అనే సినిమా చేశారు. సినిమాలకు దూరం అవ్వటానికి మరో కారణం కూడా ఉంది. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత ఆమె పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో ఆమె ప్రస్తుతం హ్యాపీ లైఫ్‌ను సాగిస్తున్నారు. అయితే, ఆమె ఇండస్ట్రీకి దూరం అవ్వటానికి ఓ యంగ్‌ హీరోతో గొడవ కారణమన్న వార్తలు కూడా వచ్చాయి.

ఈ వార్తలపై అంకిత తాజాగా, స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..‘‘ నేను విజయేంద్ర వర్మ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి అనుకున్నాను. కానీ, ఆ సినిమా హిట్ అవ్వలేదు. దాంతో కొంత ఒత్తిడికి గురయ్యాను. నవదీప్‌తో ఎలాంటి గొడవలు జరగలేదు. మేము మంచి స్నేహితులం. ఇండస్ట్రీలో నాకు ఇద్దరు స్నేహితులే ఉన్నారు. అయితే, వాళ్లు ఇప్పుడు నాతో లేరు. నన్ను వదిలి వెళ్లిపోయారు. వాళ్లే ఉదయ్ కిరణ్ – ఆర్తి అగర్వాల్’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి, నవదీప్‌తో గొడవలపై అంకిత క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet