iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోయిన్-డైరెక్టర్ మధ్య గొడవ? ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిన బ్యూటీ!

  • Published Jan 31, 2024 | 10:41 AM Updated Updated Jan 31, 2024 | 10:41 AM

తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు ఓ స్టార్ డైరెక్టర్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ తో గొడవేంటి? ఆ వివరాలు..

తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు ఓ స్టార్ డైరెక్టర్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ తో గొడవేంటి? ఆ వివరాలు..

  • Published Jan 31, 2024 | 10:41 AMUpdated Jan 31, 2024 | 10:41 AM
స్టార్ హీరోయిన్-డైరెక్టర్ మధ్య గొడవ? ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిన బ్యూటీ!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ మధ్య అప్పుడప్పుడు కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే అవి పెద్దగా జనాల్లోకి రావు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే గొడవలు బయటకి తెలుస్తుంటాయి. కొందరికి డేట్స్ దగ్గర క్లాష్ వస్తే.. మరికొందరికి డబ్బుల దగ్గర గొడవలు వస్తాయి. కాగా.. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు ఓ స్టార్ డైరెక్టర్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ తో గొడవేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఐశ్వర్య రాజేష్.. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, తమిళ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరీర్ ప్రారంభించి.. హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఈ అమ్మడు. అయితే తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. తగిన గుర్తింపు దక్కించుకోలేకపోయింది. దీంతో తమిళ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఐశ్వర్యపై తమిళ దర్శకుడు వీరపాండియన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. “ఐశ్వర్య రాజేష్ ను నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశాను. అమెకు అవకాశాలు లేని టైమ్ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాను. అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యాక, నా మూవీస్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించటంలేదు. తొలి సినిమా సమయంలో ఆటో ఖర్చులకు సైతం నేనే డబ్బులు ఇచ్చాను” అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ వీరపాండియన్.

Conflict between star heroine-director

ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారడంతో.. డైరెక్టర్ వ్యాఖ్యలపై ఇన్ డైరెక్ట్ గా స్పందించింది ఐశ్వర్య. “చాలా మంది అసలు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇలా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో లైఫ్ లో ఉన్న అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడటం కానీ, ఆరోపణలు చేయడం కానీ చేస్తే బాగుంటుంది” అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. దీంతో ఆమె ఇన్ డైరెక్ట్ దర్శకుడు వీరపాండియన్ కే కౌంటర్ ఇచ్చింది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఐశ్వర్య రాజేష్ చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet