iDreamPost
android-app
ios-app

హీరోయిన్ ఆదా శర్మకి తీవ్ర అస్వస్థత! వెంటనే హాస్పిటల్ లో చేరిక!

  • Author ajaykrishna Updated - 07:58 AM, Thu - 3 August 23
  • Author ajaykrishna Updated - 07:58 AM, Thu - 3 August 23
హీరోయిన్ ఆదా శర్మకి తీవ్ర అస్వస్థత! వెంటనే హాస్పిటల్ లో చేరిక!

హీరోయిన్ ఆదా శర్మ తీవ్రమైన అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. సడన్ గా ఆమె ఆరోగ్యం క్షీనించడంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారని సమాచారం. ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలు ఆదా శర్మకి ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఆదా శర్మ తాను నటించిన కమాండో వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ జరుగుతున్న టైమ్ లో.. ఆదా ఒక్కసారిగా అలర్జీ, వాంతులు, మోషన్స్ కి గురైంది. దీంతో వెంటనే ఆమెను అక్కడి సిబ్బంది హాస్పిటల్ లో చేర్చారట. అనంతరం ఆదా శర్మ టీమ్.. ఆమె అనారోగ్యానికి గురైందని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఆదా శర్మ ఆరోగ్యం గురించి ఆమె సన్నిహితులు సైతం స్పందించారు. ఆదా చాలా ఒత్తిడిలో పని చేస్తున్న కారణంగా ఆమెకు డయేరియా వచ్చిందని.. అందుకే ఆమె అస్వస్థతకు గురైందని వారు తెలిపారు. ప్రస్తుతం ఆదా వైద్యుల పర్యవేక్షణలో ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. హీరోయిన్ గా ఆదా శర్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగులో అడుగుపెట్టిన ఆదా.. తొలి మూవీ హిట్ అవ్వడంతో.. వరుసగా సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం లాంటి సినిమాలలో అవకాశాలు అందుకుంది. అలా తెలుగు మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషలలో కూడా సినిమాలు చేస్తూ పోతుంది.

రీసెంట్ గా ఆదా శర్మ ‘ది కేరళ స్టోరీ’ అనే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇన్నిరోజులు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆదాకి కేరళ స్టోరీ మూవీ ఇచ్చిన హిట్టు చాలా ప్లస్ అయ్యిందని చెప్పాలి. ప్రస్తుతం ఆదా చేతిలో తెలుగు సినిమాలేవి లేవు. 2019లో చేసిన కల్కి మూవీ తర్వాత తెలుగు మళ్లీ ఏ సినిమా చేయలేదు ఆదా. ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఆదా తన ఫాలోయర్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. అలాంటిది సడన్ గా ఆమె అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిందని తెలిసి ఫ్యాన్స్, నెటిజన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆదా త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఆదా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvolePradabet güncel girişcasibomgalabet güncel girişJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet