iDreamPost
android-app
ios-app

యోగిబాబుకు మాటిచ్చిన ధోనీ.. CSKలోకి ఆయన ప్లేసులో..

  • Published Jul 11, 2023 | 10:20 AM Updated Updated Jul 11, 2023 | 10:20 AM
  • Published Jul 11, 2023 | 10:20 AMUpdated Jul 11, 2023 | 10:20 AM
యోగిబాబుకు మాటిచ్చిన ధోనీ..  CSKలోకి ఆయన ప్లేసులో..

ప్రముఖ భారత క్రికెటర్‌ ఎమ్‌ఎస్‌ ధోనీ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళంలో ఆయన లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌ ‘ఎల్‌జీఎమ్‌’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం చెన్నైలో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమెడియన్‌ యోగిబాబు, ఎమ్‌ఎస్‌ ధోనీలకు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఆ సంభాషణ ఏంటంటే…

యోగిబాబు, ధోనీతో మాట్లాడుతూ.. ‘‘ నన్ను చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి తీసుకోండి!’’ అని అడిగాడు. ఇందుకు ధోనీ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ధోనీ సమాధానం ఇస్తూ.. ‘‘ రాయుడు రిటైర్‌మెంట్‌ తీసుకున్నాడు. అందువల్ల మీకు సీఎస్‌కేలో స్థానం ఉంది. నేను మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతాను. కానీ, మీరు సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. నేను మీకోటి చెబుతాను. మీరు చాలా నిలకడగా గేమ్‌ ఆడాలి. వాళ్లు చాలా స్పీడుగా బౌలింగ్‌ వేస్తారు. వారి బౌలింగ్‌ కారణంగా మీకు దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంటుంది’’ అని అన్నారు.

కాగా, ఎల్‌జీఎమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో హరీష్‌ కల్యాణ్‌, ఇవానా జంటగా నటించారు. నదియా, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక, నిన్న విడుదలైన ఎల్‌జీఎమ్‌ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో కామెడీ ప్రధానంగా ఉండనుందని, ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఎల్‌జీఎమ్‌కు సంబంధించి ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాదే ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి, యోగిబాబుకు ఎమ్‌ఎస్‌ ధోనీ సీఎస్‌కేలో అవకాశం ఇస్తానని ఫన్నీగా అనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom