iDreamPost
android-app
ios-app

అభిమాని ఇంట్లో విజయ్ సేతుపతి! ఈయన కదా నిజమైన స్టార్!

  • Published May 31, 2024 | 3:46 PM Updated Updated May 31, 2024 | 3:46 PM

Actor Vijay Sethupathi: సినీ ఇండస్ట్రీలో తనదైన సహజన నటనతో మెప్పిస్తున్నారు విజయ్ సేతుపతి. పాత్ర ఎలాంటిదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేస్తూ పాత్రకు వన్నె తెస్తున్నాడు. అభిమానులను ఎప్పుడూ సంతోషపెట్టే విజయ్ సేతుపతి... ఓ అభిమానికి ఊహంచని గిఫ్ట్ ఇచ్చారు.

Actor Vijay Sethupathi: సినీ ఇండస్ట్రీలో తనదైన సహజన నటనతో మెప్పిస్తున్నారు విజయ్ సేతుపతి. పాత్ర ఎలాంటిదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేస్తూ పాత్రకు వన్నె తెస్తున్నాడు. అభిమానులను ఎప్పుడూ సంతోషపెట్టే విజయ్ సేతుపతి... ఓ అభిమానికి ఊహంచని గిఫ్ట్ ఇచ్చారు.

  • Published May 31, 2024 | 3:46 PMUpdated May 31, 2024 | 3:46 PM
అభిమాని ఇంట్లో విజయ్ సేతుపతి! ఈయన కదా నిజమైన స్టార్!

జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నట్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో విజయ్ సేతుపతి ఒకరు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతినిండా సినిమాలు ఉన్నాయి. విజయ్ సేతుపతి నటుడిగాన కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి మన్నలు పొందుతున్నారు. ఇటీవల సినీ హీరోలు తమ అభిమానులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేమున్నామ్న భరోసా ఇస్తున్నారు.. అంతే అభిమానుల ఇంట శుభకార్యాలకు వెళ్లి సంతోషపెడుతున్నారు. తాజాగా విజయ్ సేతుపతి తన అభిమాని ఇంటికి వెళ్లి సర్పైజ్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇండస్ట్రీలో ‘మక్కల్ సెల్వన్’ అని పేరుతో పిలుస్తారు అభిమానులు. ఇండస్ట్రీలోకి రాక ముందు దుబాయ్ లో ఎన్ఆర్ఐ అకౌంటెంట్ బాధ్యతలు నిర్వహించారు. నటనపై మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు విజయ్ సేతుపతి. 2010 లో ‘తెన్మెర్కు పరువుకాట్రు ’ మూవీతో కెరీర్ ప్రారంభించాడు. సుందరపాండియన్, పిజ్జా మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి తన సహజ నటనతో ఎలాంటి పాత్రలకైనా వన్నె తెస్తారని టాక్. నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి ప్రాతైనా తాను చేస్తానని పలు ఇంటర్వ్యూలో చెప్పాడు. తాజాగా ఓ అభిమాని ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు విజయ్ సేతుపతి.

తమిళనాడు మదురై జిల్లా ఉసిలంబట్టి లో కిజాపుదూర్ కి చెదిన జయబాస్, జయపాల్ సోదరులు విజయ్ సేతుపతికి హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఇద్దరూ ఒక్కో జిల్లా అభిమాన సంఘానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మే 2న జయబాస్, జయపాల్ ఇష్టమైన యువతులను పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లికి విజయ్ సేతుపతిని రావాలని కోరారు. ఈ సమయంలో షూటింగ్ ఉండటంతో హాజరు కాలేకపోయారు విజయ్ సేతుపతి. తాజాగా తన ఇద్దరు అభినుల ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు. నూతన వధూ వరులను ఆశీర్వదించారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ప్రస్తుతం విజయ్ సేతుపతి మహరాజా, ట్రైన్, ఎస్ చిత్రాల్లో నటిస్తున్నారు.. బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ తో జవాన్, కత్రినాతో మెర్రీ క్రిస్మస్ మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet