iDreamPost
android-app
ios-app

కోట్లు కొల్లగొట్టిన ఉపేంద్ర ‘A’ సినిమా.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

  • Published Jun 12, 2024 | 12:43 PM Updated Updated Jun 12, 2024 | 12:43 PM

Upendra A Movie Re Release: సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోల సినిమాలు మరోసారి వెండితెరపై చూడటంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోతున్నారు.

Upendra A Movie Re Release: సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోల సినిమాలు మరోసారి వెండితెరపై చూడటంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోతున్నారు.

  • Published Jun 12, 2024 | 12:43 PMUpdated Jun 12, 2024 | 12:43 PM
కోట్లు కొల్లగొట్టిన ఉపేంద్ర ‘A’  సినిమా.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

ఇటీవల సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో స్టార్ హీరోలు నటించిన సినిమాలు ధియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు.  తమ అభిమాన హీరోల సినిమాలు ధియేటర్లలో రీ రిలీజ్ కావడంతో అభిమానులు మళ్లీ చూసేందుకు ఎగబడుతున్నారు. అన్ని భాషల్లో ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే అప్పట్లో అట్టర్ ఫ్లాప్ సినిమాలు రీ రిలీజ్ తర్వాత హిట్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లు రాబడుతున్నాయి. చాలా వరకు  రీ రిలీజ్ సినిమాలు స్టార్ హీరో పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయడం విశేషం. తాజాగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్, హీరో ఉపేంద్ర నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్‌కి సిద్దమైంది. వివరాల్లోకి వెళితే..

భారతీయ సినీ ఇండస్ట్రీలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలుగు ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఉపేంద్ర. నటుడిగానే కాదు మల్టీపుల్ ట్యాలెంట్ ఉన్న ఉపేంద్ర దర్శకుడిగా పలు చిత్రాలు తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు పాత సినిమాలు హై క్యాలిటీతో రీ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కన్నడ నాట బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా ‘A’. ఈ చిత్రం తెలుగులో డబ్ చేశారు.. ఇక్కడ కూడా మంచి టాక్ వచ్చింది. ఉపేంద్ర స్వియ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రం ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది.

1998 లో అంటే 26 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా 100 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శించబడింది. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు మూడు వారాల వరకు టిక్కెట్లు దొరకలేదంటే అప్పట్లో ఏ రేంజ్‌లో ట్రెండ్ సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ సినిమా 20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ కల్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్దమైతున్నారు నిర్మాత లింగం యాదవ్. ఇటీవల హీరో ప్రభాస్ నటించిన చత్రపతి, యోగి సినిమాలను 4కే లో రీ రిలీజ్ చేసి మంచి పేరు సంపాదించారు లింగం యాదవ్. ఇప్పటికే కన్నడ నాట రీ రిలీజ్ అయి మళ్లీ ప్రభంజనం సృష్టించి ఈ మూవీ జూన్ 21 న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘A’ బుద్దిమంతులకు మాత్రమే అనే మూవీ శిర్షిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş