iDreamPost
android-app
ios-app

హీరో శ్రీకాంత్ ఇంట పెళ్లి బాజాలు! వైరల్ అవుతున్న ఫోటో!

  • Author ajaykrishna Published - 10:55 AM, Wed - 26 July 23
  • Author ajaykrishna Published - 10:55 AM, Wed - 26 July 23
హీరో శ్రీకాంత్ ఇంట పెళ్లి బాజాలు! వైరల్ అవుతున్న ఫోటో!

సెలబ్రిటీల ఇళ్లలో పెళ్లి బాజాలు మోగుతున్నాయంటే ముందుగా సంతోషించేది అభిమానులే. ఎప్పుడూ సినిమా వార్తలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి శుభాకార్యాలకు సంబంధించి కూడా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే.. రెగ్యులర్ గా వార్తల్లో నిలిచే సెలబ్రిటీల నుండి కొత్త కబుర్లు వినిపించడం మామూలే. అదే ఎప్పుడో ఓసారి హాట్ టాపిక్ గా కనిపించే వారినుండి గుడ్ న్యూస్ అంటే ఎలాగైనా స్పెషల్ ఫోకస్ పడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ కి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే. కూతురుని సినిమాల్లోకి తీసుకురాలేదు. కానీ.. కొడుకును హీరో చేశాడు.

ప్రస్తుతం శ్రీకాంత్ కొడుకు రోషన్.. హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన లాస్ట్ మూవీ ‘పెళ్లిసందడి’ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. అయితే.. ఇప్పుడు రోషన్ మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ చేస్తున్న పాన్ ఇండియా మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఇప్పుడు రోషన్ పేరు ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చిన హీరో. ఆయన భార్య ఊహ కూడా గతంలో హీరోయిన్ గా సినిమాలు చేశారు. వీరిద్దరూ కలిసి సినిమాలు చేసే టైమ్ లో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విషయం విదితమే. ఇక పెళ్లి తర్వాత ఊహ గృహిణిగా ఫ్యామిలీని చూసుకుంటూ ఉండిపోయింది.

కట్ చేస్తే.. శ్రీకాంత్ కి సొంత తమ్ముడు అనిల్.. ఆయన కూతురు వివాహ వేడుకలు ప్రెజెంట్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. తమ్ముడి కూతురు పెళ్లి కావడంతో శ్రీకాంత్ కుటుంబంతో పాటు ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు. పెళ్లి కూతురిని కుటుంబ సమేతంగా ఆశీర్వదించారు. అయితే.. పెళ్ళిలో శ్రీకాంత్ ఫ్యామిలీ చేసిన సందడికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో శ్రీకాంత్.. ఆయన భార్య ఊహ, కుమారులు రోషన్, రోహన్.. కూతురు మేధా ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే.. ఆ మధ్య శ్రీకాంత్, ఆయన భార్య ఊహ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ.. అవేం నిజం కాదని తర్వాత క్లారిటీ ఇచ్చారు శ్రీకాంత్. మరి శ్రీకాంత్ ఫ్యామిలీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş