iDreamPost
android-app
ios-app

నిచ్చెనలు కాదు.. లిఫ్టు రెడీ అవుతున్నాయి

  • Published Mar 15, 2024 | 8:46 PM Updated Updated Mar 15, 2024 | 8:46 PM

శ్రీ విష్ణు కెరీర్ గ్రాప్ పెరుగుతూనే ఉంది. అక్కడక్కడ చిన్నపొరపాట్లు దొర్లినా కూడా తనదైన బ్యాలెన్స్ ను కోల్పోకుండా మళ్ళీ స్ట్రెయిట్ లైన్లోకి తొందరగా రాగలిగే ఏదో స్పెషాల్టీ శ్రీవిష్ణులో ఉంది.

శ్రీ విష్ణు కెరీర్ గ్రాప్ పెరుగుతూనే ఉంది. అక్కడక్కడ చిన్నపొరపాట్లు దొర్లినా కూడా తనదైన బ్యాలెన్స్ ను కోల్పోకుండా మళ్ళీ స్ట్రెయిట్ లైన్లోకి తొందరగా రాగలిగే ఏదో స్పెషాల్టీ శ్రీవిష్ణులో ఉంది.

  • Published Mar 15, 2024 | 8:46 PMUpdated Mar 15, 2024 | 8:46 PM
నిచ్చెనలు కాదు.. లిఫ్టు రెడీ అవుతున్నాయి

హీరోగా చేసినవి తక్కువ సినిమాలే అయినా, శ్రీ విష్ణు కెరీర్ గ్రాప్ పెరుగుతూనే ఉంది. అక్కడక్కడ చిన్నపొరపాట్లు దొర్లినా కూడా తనదైన బ్యాలెన్స్ ను కోల్పోకుండా మళ్ళీ స్ట్రెయిట్ లైన్లోకి తొందరగా రాగలిగే ఏదో స్పెషాల్టీ శ్రీవిష్ణులో ఉంది. పైగా ఈ మధ్యనే సామజవరగమనా లాంటి గ్రాండ్ హిట్ సాధించాడు. దాంతో మార్చి 22న రాబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ ఓం భూమ్ బుష్ కి స్టన్నింగ్ బజ్ వచ్చింది. ఈ రోజునే రిలీజైన ట్రైలర్ యూత్ ని బాగా రెచ్చగొట్టే ఎంటర్ టైన్ మెంటుతో ఫుల్ ఎంగేజింగ్ గా ఉంది. త్రిబుల్ ఏ ధియేటర్లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ యూత్ పార్టిసిపేషన్ టాప్ గేర్ లో నడిచింది.

కేకలు, ఈలలు…. ధియేటర్ దద్దరిల్లిపోయింది. శ్రీ విష్ణుకి ఇంత ఫాలోయింగ్ ఉందా అనిపించింది. ఆ టైంలో జరిగిన మీడియా ఇంటరాక్షన్లో ‘’మీరు కెరీర్ నిచ్చెన ఎక్కుతున్న యంగ్ హీరోగా మీ సక్సెస్ రేటు ఎలా ఉంది’’ అన్న ఐ డ్రీమ్ ప్రశ్నకు ‘’ నేను కథలను నమ్ముకుంటాను. కొత్తగా ఉంది అనిపిస్తే చర్చించి మరీ ప్రాజెక్టు టేకప్ చేస్తాను. నా అబిరుచులు, ఇష్టాయిష్టాలను పక్కన పెడతాను. పెట్టేశాను కూడా. ఆడియన్స్ ని మెప్పించడం కోసమే నా తాపత్రయం. అంతే కానీ మధ్యలో నా ఇంట్రస్టులు తీసుకురాను. సో….నిచ్చెనలు కాదు. నాకోసం లిప్టే రెడీ అవుతోంది’’ అన్నాడు విష్ణు.

అల్లు అర్జున్ గారితో ఎప్పుడైనా రెడీ

అల్లు అర్జున్ తో సన్ ఆప్ సత్యమూర్తి చేశారు కదా మళ్ళీ చేస్తారా అనే మీడియా క్వశ్చన్ కి’’ ఇప్పుడే ధియేటర్లోకి వస్తూ అనుకున్నాను. అప్పుడు బన్నీగారితో చేశాను కదా….ఆయన ధియేటర్లోనే ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్ అవుతోంది కదా అని ఎంతో ఆనందం కలిగింది. ఆయనతో సినిమా అంటే ఎప్పుడైనా రెడీ.’’ అన్నాడు.

తర్వాత ఓం భీమ్ బుష్ సినిమా గురించి చెబుతూ ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని, యూత్ ఒక్కటే కాదు, మాస్ అని కాదు, ఇందులో అల్ క్లాసెస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని శ్రీవిష్ణు చాలా గట్టిగా చెప్పాడు. హర్ష దర్శకత్వంలో రూపొందిన ఓం భీమ్ బుష్ లో శ్రీ విష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామక్రిష్ణ కూడా ఉండడంతో ఎంటర్ టైన్ మెంటు బాగా పండిందని యూనిట్ సభ్యులు పదేపదే చెబుతున్నారు. అందరూ అన్నట్టుగా గానీ సినిమా ఉంటే బంపర్ హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş