iDreamPost
android-app
ios-app

హోటల్స్, స్వీట్ షాప్స్ ప్రారంభించిన స్టార్ నటుడు

  • Published Apr 25, 2024 | 4:46 PM Updated Updated Apr 25, 2024 | 4:46 PM

నేటి కమెడియన్లే.. రేపటి హీరోలు అని నిరూపించారు ఎంతో మంది నటులు. ఈ కోవలోకి వస్తాడు ఈ హాస్య నటుడు కూడా. ఇప్పటికే 100కు పైగా సినిమాల్లో నటించిన ఈ స్టార్ కమెడియన్.. మంచి మనస్సున్నోడు. తక్కువ ధరకే భోజనాన్ని అందిస్తున్నాడు.

నేటి కమెడియన్లే.. రేపటి హీరోలు అని నిరూపించారు ఎంతో మంది నటులు. ఈ కోవలోకి వస్తాడు ఈ హాస్య నటుడు కూడా. ఇప్పటికే 100కు పైగా సినిమాల్లో నటించిన ఈ స్టార్ కమెడియన్.. మంచి మనస్సున్నోడు. తక్కువ ధరకే భోజనాన్ని అందిస్తున్నాడు.

  • Published Apr 25, 2024 | 4:46 PMUpdated Apr 25, 2024 | 4:46 PM
హోటల్స్, స్వీట్ షాప్స్ ప్రారంభించిన స్టార్ నటుడు

కమెడియన్ లేని సినిమా ఊహించుకోవడం కాస్త కష్టం. ఈ ఎంటర్ టైన్ మెంట్ రంగంలో కాస్త వినోదాన్ని పంచేది కూడా ఈ హాస్య నటులే. ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్స్.. తమ నటనతో కితకితలు పుట్టిస్తున్నారు. నవ్వులు పువ్వులు పూయిస్తూ.. సగటు ప్రేక్షకుడు పెట్టిన డబ్బులకు సాటిస్పై చేస్తున్నారు. తెలుగు నటులే కాకుండా పక్క సినీ పరిశ్రమ నుండి అరువు తెచ్చుకున్న అరవ హాస్య నటుల్ని కూడా ఆదరిస్తోంది తెలుగు ఇండస్ట్రీ. ఆ నటుల్లో ఒకరు రామ లక్ష్మణన్ ముత్తుస్వామి. ఇతడు ఎవరు అనుకుంటున్నారా.. మరెవ్వరో కాదండి.. తన నటనతో నవ్విస్తోన్న ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు సూరి. 1997 నుండి నటిస్తున్న ఈ యంగ్ కమెడియన్.. ఇప్పటికే 100పైగా సినిమాల్లో నటించాడు.ర

ప్రతి కమెడియన్‌కు ఓ సెపరేట్ ట్రాక్ ఉంటుంది. అలాగే సూరిలో కూడా డిఫరెంట్ కామెడీ టైమింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతడు బయట ఎంతో మంచి మనస్సు ఉన్న వ్యక్తి కూడా. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర హోటల్స్ నిర్మించి.. తక్కువ ధరకు పేదలకు మంచి భోజనం అందిస్తున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సరైన తిండి లేక ఇబ్బందులు పడ్డ సూరీ.. అవకాశాలు పెరిగాక.. తన కష్టం ఎవ్వరూ పడకూడదన్న ఉద్దేశంతో అమ్మన్ పేరుతో హోటల్స్ నిర్మించి.. సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నాడు. అయితే కొన్ని సార్లు వీటిపై విమర్శలు కూడా వచ్చాయి. కొంత మంది హోటల్స్ యాజమానులు ఎలా అంత తక్కువకు ఫుడ్ ఇస్తున్నాడన్న ఆరోణలపై తనిఖీలు జరిగాయి. అన్ని సరిగ్గానే ఉండటంతో వెను దిరిగారు. జీఎస్టీ వేయకుండా ఆహారాన్ని అందిస్తుండటంతో.. నోటీసులు జారీ చేయగా.. విచారణకు హాజరైన సూరి… జీఎస్టీ డబ్బును ప్రభుత్వానికి చెల్లించాడు.

తాజాగా ఈ నటుడు అమ్మన్ పేరుతో లగ్జరీ హోటల్‌ను నిర్మించాడు. అలాగే మధురైలో తాజాగా స్వీట్ షాపును కూడా ప్రారంభించాడు. అక్కడ కాస్త ధరలు లగ్జేరియస్‌గా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఫుడ్ వ్లాగర్స్ అక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇంతకు అక్కడ స్వీట్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి.. రివ్యూస్ ఇస్తున్నారు. ఇంతకు ఆ స్వీట్ షాప్ ఎక్కడ ఉందంటే రిజర్వ్ లైన్ జంక్షన్‌లో. ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్, కెమికల్స్ కలపని.. స్వీట్స్ లభిస్తున్నాయట. హల్వా కేజీ 340కే లభిస్తుంది. ఇక మిల్క్, బాదం హల్వా, బెంగాలీ స్వీట్స్, ఘీ లడ్డు, తిరుపతి లడ్డు, మైసూర్ పాక్, కాజూ స్వీట్స్, స్పెషల్ కాజూ స్వీట్స్ ఉన్నాయి. వీటితో పాటు రోజ్, బాదం మిల్క్ చాలా రుచిగా ఉన్నాయట. అలానే హాట్ ఫుడ్స్ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. సూరి గత ఏడాది విడుదలై చిత్రంతో హీరోగా అలరించాడు. దీనికి సీక్వెల్ కూడా రాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Eat V2 Food | Balaji Selvaraj (@eatv2food)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş