సీఎం రేవంత్ రెడ్డికి సారీ చెప్పిన నటుడు సిద్ధార్థ్.. కారణం అదేనా?

Actor Siddharth: ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ లో భాగంగా హీరో సిద్దార్ధ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Actor Siddharth: ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ లో భాగంగా హీరో సిద్దార్ధ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. లంచగొండి తనంపై తెరకెక్కిన ఈ చిత్రం కమల్ హాసన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో భారతీయుడు సీక్వెల్ ‘భారతీయుడు 2’ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సిద్దార్థ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన సిద్దార్థ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల సినిమా టికెట్ల రేట్లు పెంచాలంటే హీరోలు డ్రగ్స్ అవగాహన గురించి వీడియోలు చేస్తే ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తే మంచిది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హీరో సిద్దార్థను ఓ విలేఖరి ప్రశ్నించగా.. ఆయన ఇచ్చిన ఆన్సర్ కాంట్రవర్సీగా మారింది. దీనిపై స్పందించిన సిద్దార్థ వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పడమే కాదు.. తాను చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారని క్లారిటీ ఇచ్చాడు. భారతీయు 2 మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో సిద్దార్థ, కమల్ హాసన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా సిద్దార్థ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నానని.. తనకు సామాజిక బాధ్యత బాగా తెలుసు అని అన్నాడు. 2005 నుంచి 2011 వరకు కండోమ్స్ ను ప్రచారం చేశానని. హైదరాబాద్ లో కండోమ్ వాడమని చేతిలో కండోమ్ పెట్టుకొని హూర్డింగ్స్ పై ఫోజు ఇచ్చిన నటుడిని తనే అని చెప్పాడు.

ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడిగిన దానికి సిద్దార్థ్ ఇలా రియాక్ట్ కావడం పై నెటిజన్లు విమర్శలు చేశారు. దీంతో వెంటనే తెలంగాణ సీఎం కి క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు సిద్దార్థ్.  ఈ సందర్భంగా సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘నా మాటల వెనుక ఉద్దేశం తెలంగాణ సీఎం రెవంత్ రెడ్డిని విమర్శించడం కాదు.. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. మెరుగైన సమాజాన్ని రూపొందించడంలో సినీ ఇండస్ట్రీని భాగం చేయాలనుకోవడం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నేను 100 శాంతం ఉంటాను. భారతీయుడు 2 మూవీలో ముఖ్య ఉద్దేశం అవినీతి, డ్రగ్స్ ని అసలు సహించకూడదు.. సమాజంలో వీటిని రూపుమాపాలి అని చెప్పాం. అలాంటి మూవీ ప్రమోషన్ లో నేను మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ విషయాన్ని నేను వెంటనే క్లీయర్ చేయాలని ఈ వీడియో చేశాను. డ్రగ్స్ కి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి నేను ఎప్పుడూ మద్దతు ఇస్తాను.’ అని చెప్పారు సిద్దార్థ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments