iDreamPost
android-app
ios-app

మహిళపై అత్యాచారం.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అరెస్ట్!

  • Published Oct 06, 2023 | 12:12 PMUpdated Oct 06, 2023 | 12:12 PM
  • Published Oct 06, 2023 | 12:12 PMUpdated Oct 06, 2023 | 12:12 PM
మహిళపై అత్యాచారం.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అరెస్ట్!

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ ఇతర భాషల్లో కూడా మంచి సక్సెస్ రేటింగ్ తో దూసుకు పోతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు మరికొన్ని భాషల్లో బిగ్ బాస్ వస్తుంది. తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 కి కిగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ లో వీరం మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు షియాస్ కరీమ్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన షియాస్ తర్వాత సినీ రంగ ప్రవేశం చేశాడు. విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. 2018లో రియాలిటీ షో ‘బిగ్ బాస్ మలయాళం 1’ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించాడు. బిగ్ బాస్ తో బాగా ఫేమ్ అయిన షియాస్ తాజాగా ఓ చీటింగ్, అత్యాచార కేసులో చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షియాస్ కరీమ్ గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని ఆమెపై లైంగిక దాడి చేశాడని, ఆమె దగ్గర దాదాపు రూ.11 లక్షలు తీసుకొని మానసికంగా చిత్రం హింసలకు గురిచేసినట్లు తెలిపారు. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.

మాలీవుడ్ ఇండస్ట్రీలో షియాస్ కరీమ్ పలు చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించాడు. అంతేకాదు సొంతంగా జిమ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తన జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్న 32 ఏళ్ల మహిళతో చనువు పెంచుకొని ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని.. తన వ్యాపారంలో భాగస్వామ్య ఇస్తానని నమ్మించి 11 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి, డబ్బు విషయం అడగడంతో ముఖం చాటేస్తూ వచ్చాడు.

ఈ క్రమంలోనే సదరు మహిళ గత నెలలో కాసర్ గోడ్ లోని చందేరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి షియాస్ కనిపించకుండా తిరుగుతున్నాడు. ఆయనపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే గురువారం చెన్నై ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, సదరు మహిళ 2021 నుంచి షియాస్ తనను మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Shiyas Kareem (@shiyaskareem)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి