iDreamPost
android-app
ios-app

నటి షకీలాపై కూతురు దాడి.. ఆమె ఇంటికి వెళ్లి మరీ

  • Published Jan 21, 2024 | 6:04 PM Updated Updated Jan 21, 2024 | 6:04 PM

థియేటర్ల రప్పించగలిగే సత్తా కేవలం హీరోలకు మాత్రమే ఉందనుకుంటే పొరపాటు. ఈమె సినిమాలు వస్తున్నాయంటే.. థియేటర్ల ముందు క్యూ కట్టేవారు.. కుర్రకారు నుండి కాటికి కాళ్లు చాపే ముదసలి వరకు. ఆ నటే షకీలా. ఈ నటిపై..

థియేటర్ల రప్పించగలిగే సత్తా కేవలం హీరోలకు మాత్రమే ఉందనుకుంటే పొరపాటు. ఈమె సినిమాలు వస్తున్నాయంటే.. థియేటర్ల ముందు క్యూ కట్టేవారు.. కుర్రకారు నుండి కాటికి కాళ్లు చాపే ముదసలి వరకు. ఆ నటే షకీలా. ఈ నటిపై..

  • Published Jan 21, 2024 | 6:04 PMUpdated Jan 21, 2024 | 6:04 PM
నటి షకీలాపై కూతురు దాడి.. ఆమె ఇంటికి వెళ్లి మరీ

ఒకప్పటి శృంగార తార అనగానే..ఠక్కున గుర్తుకు వచ్చే నటి షకీలా. మలయాళ సినిమాల్లో ఆమె క్రేజే వేరు. మాలీవుడ్‌లో బీ గ్రేడ్ మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. శృంగారపరమైన చిత్రాల్లో నటించిన ఆమె.. అప్పట్లో చాలా మంది యూత్ కలల రాణిగా మారింది. మలయాళ స్టార్ హీరోలకు ధీటుగా ఈమె నటించిన చిత్రాలు ఆడేవి. ఆమెతో సినిమాలు చేసి నిర్మాతలు చాలా లాభపడ్డారు. కానీ రోటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టడంతో షకీలా సినిమాలకు ఆదరణ తగ్గింది. దీనికి తోడు ఆమె కూడా అలాంటి పిక్చర్స్ చేయడం మానేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి..తెలుగులో కూడా నటించిన సంగతి విదితమే.

జయం, తొట్టి గ్యాంగ్, నిజం, దొంగోడు, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లో అలరించింది. కాగా, నటి షకీలాపై దాడి చేసింది. ఆమె దత్త పుత్రిక శీతల్ ఆమెపై దాడి చేసింది. చెన్నైలోని ఆమె ఇంట్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమె కోడంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దత్త పుత్రిక శీతల్‌తో జరిగిన గొడవలో తనకు, తన లాయర్ సౌందర్యకు గాయాలయ్యాయని షకీలా ఫిర్యాదులో పేర్కొంది. శీతల్ షకీలా సోదరుడి కుమార్తె. ఆమెను అడాప్ట్ చేసుకుని సొంత బిడ్డలా సాకింది షకీలా.ఆరు నెలల ప్రాయంలోనే తన మేన కోడలు శీతల్‌ను కూతురిలా పెంచుతోంది. అనేక వేదికలపై కూడా ఆమె అత్త కాదని, అమ్మ అని శీతల్ కూడా మాట్లాడిన సంగతి విదితమే.

అయితే ఇప్పుడు ఇదే శీతల్ షకీలాపై దాడి చేయడం కోలీవుడ్ ఇండస్ట్రీ విస్మయానికి గురైంది. అయితే శీతల్, షకీలా కుటుంబ సభ్యుల మధ్య కొన్ని రోజుల నుండి విబేధాలు వచ్చాయని, ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి.. ఇద్దరి మధ్య గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. చెన్నైలోని షకీలా ఇంటికి శీతల్, ఆమె సొంత తల్లి, సోదరితో కలిసి వెళ్లి దాడి చేసిందని సమాచారం. ఈ ఘటనలో షకీలా న్యాయవాదికి కూడా గాయాలయ్యాయి. శీతల్ తో సహా ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పెంపుడు కూతురు కూడా షకీలాపై కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసుల విచారణ చేపడుతున్నారు. అయితే ఇటీవల ఆమె ఓ టెలివిజన్‌లో షో ‘కుక్ విత్ కోమలి’ తన ఇమేజ్ పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను అమ్మ అని పిలుస్తున్నారు. షకీలా జీవితంలో చోటుచేసుకున్న ఈ మార్పుల గురించి మీ అభిప్రాయాన్ని  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom