iDreamPost
android-app
ios-app

బాహుబలి కట్టప్ప ఇంట తీవ్ర విషాదం.. సంతాంప తెలిపిన ప్రముఖులు

  • Published Aug 12, 2023 | 7:58 AM Updated Updated Aug 12, 2023 | 7:58 AM
  • Published Aug 12, 2023 | 7:58 AMUpdated Aug 12, 2023 | 7:58 AM
బాహుబలి కట్టప్ప ఇంట తీవ్ర విషాదం.. సంతాంప తెలిపిన ప్రముఖులు

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మృతి చెందారు. దాంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సత్యరాజ్‌ తల్లి నతంబాల్‌(94) గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె శుక్రవారం సాయంత్ర కోయంబత్తూర్‌లోని తన నివాసంలో కన్ను మూశారు. హైదారబాద్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్న సత్యరాజ్‌.. తన తల్లి మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే.. కోయంబత్తూర్‌ తిరుగు ప్రయాణం అయ్యారు. తల్లి మృతి నేపధ్యంలో సత్యరాజ్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తల్లి అంటే సత్యరాజ్‌కు ఎంతో ఇష్టం. తాను నటించిన సినిమాలు చూడటం ఎంతో ఇష్టమని.. తల్లి తనని ప్రశంసిస్తే.. ఎంతో సంతోషించేవాడిని అని గతంలో అనేక ఇంటర్వ్యూల్లో సత్యరాజ్‌ చెప్పుకొచ్చాడు. ఇక నతంబాల్‌కు సత్యరాజ్‌ ఒక్కడే కుమారుడు కాగా.. ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు.

సత్యరాజ్‌ మృతి నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ‘‘కోలీవుడ్‌ నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌.. ట్విట్టర్‌ వేదికగా సంతాంప తెలిపారు. నటుడు, సోదరుడు సత్యరాజ్‌ మాతృమూర్తి మృతి చెందారనే వార్త తెలిసి చాలా బాధపడ్డాను. అమ్మయ్యర్‌ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సోదరుడు సత్యరాజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ బాధను ఓదార్చుకునే ధైర్యాన్ని సత్యరాజ్‌కు ఇవ్వాల్సిందిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ట్వీట్‌ చేశాడు.

Actor satyaraj mother passed away

కోటీవుడ్‌ నటుడు అయినప్పటికి సత్యరాజ్‌కు తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. బాహుబలి చిత్రంలోని కట్టప్ప పాత్ర ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణలతో పాటుగా సత్యరాజ్‌ కట్టప్ప పాత్ర జనాల మదిలో నిలిచిపోయింది. ప్రస్తుతం సత్యరాజ్‌ కోలీవుడ్‌, టాలీవుడ్‌లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సత్యరాజ్‌ కుమారుడు శిబి సత్యరాజ్‌ సైతం కోలీవుడ్‌లో హీరోగా సెటిల్‌ అయ్యాడు. సత్యరాజ్‌ తల్లి మృతి గురించి తెలిసి టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా సంతాపం తెలుపుతున్నారు.

Jojobet GirişjojobetcasibomjojobetcasibombetsmovemariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişJojobet Giriş