iDreamPost

కట్టప్ప కూతుర్ని ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్ ను మించే అందంతో!

  • Published Jun 24, 2024 | 2:55 PMUpdated Jun 24, 2024 | 2:55 PM

తమిళ స్టార్ నటుడు, టాలీవుడ్ కట్టప్ప.. సత్యరాజ్ గురించి అందరికి తెలిసిందే. బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి ఇంతవరకు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ, తాజాగా ఆయన కూతురి లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ అమ్మాడు అందం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు.

తమిళ స్టార్ నటుడు, టాలీవుడ్ కట్టప్ప.. సత్యరాజ్ గురించి అందరికి తెలిసిందే. బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి ఇంతవరకు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ, తాజాగా ఆయన కూతురి లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ అమ్మాడు అందం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు.

  • Published Jun 24, 2024 | 2:55 PMUpdated Jun 24, 2024 | 2:55 PM
కట్టప్ప కూతుర్ని ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్ ను మించే అందంతో!

కోలీవుడ్ నటుడు ‘సత్యరాజ్’.. ఈ పేరుతో పరిచయం కన్నా బహుబలి సినిమా కట్టప్పగానే అందరికీ పరిచయం ఎక్కువ.ఇకపోతే పేరుకు ఈయన తమిళ్ నటుడు అయిన తెలుగులో ఈయనకు ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ముఖ్యంగా దక్షిణాది చిత్రపరిశ్రమలో విలక్షణ నటుల్లో సత్యరాజ్ కూడా ఒకరు. అయితే రాజమౌళి తెరకెక్కించిన బహుబలి సినిమాలో సత్యరాజ్ కట్టప్ప పాత్రలో నటించి పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇకపోతే గతంలో కూడా ఆయన పలు తెలుగు సినిమాలైన శంఖం, మిర్చి, నేను శైలజ వంటి చిత్రాల్లో తండ్రి పాత్రాల్లో అలరించారు. కానీ, ఎక్కువగా ఆయనకు క్రేజ్ తెచ్చిపెట్టిన క్యారెక్టర్ బహుబలి కట్టప్ప పాత్రనే చెప్పవచ్చు.

అలాగే సత్యరాజ్ తమిళ్, తెలుగుతోపాటు మలయాళం, కన్నడ వంటి భాషల్లో అనేక సినిమాల్లో అలరించారు. ఇదిలా ఉంటే.. సినిమాలో ఎంత స్టార్ స్టేటెస్ ఉన్నా ఈయన బయట చాలా సింపుల్ గా ఉంటాడు. ముఖ్యంగా మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. అందుకే సత్యరాజ్ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ, తాజాగా సత్యరాజ్ కూతురి లేటెస్ట్ ఫిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి, ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం. తమిళ నడుటు సత్యరాజ్ కు భార్య మహేశ్వరి, ఓ కొడుకు కూతురు ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే.. సత్యరాజ్ సినిమాల్లో తప్ప బయట అంతగా యాక్టివ్ గా ఉండారు. ఈ క్రమంలోనే ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఏ విషయం కూడా అంతగా ఎవరికి పరిచయం ఉండదు.

కానీ, సత్యరాజ్ కూతురు, కూమారుడు మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. కాగా, ఇప్పటికే ఆయన కూమారుడు సిబిరాజ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.  ఈ క్రమంలోనే డోరా, మాయోన్‌ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆయన కూతురు పేరు ‘దివ్య సత్యరాజ్‌’. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో  తెగ ట్రెండ్ అవుతుంది. అయితే దివ్య గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటుంది. కాగా, ఈమె న్యూట్రిషియన్‌గా తన కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే స్టార్ నటుడి కూతురు అయినప్పటికీ దివ్య మీడియాలో పెద్దగా కనిపించదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఈ క్రమంలోనే తరచు తనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ ఫోటోస్ కాస్త వైరల్ అవ్వడంతో హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందం కట్టప్ప కూతురి సొంతం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటారు. కాగా, దివ్య ప్రస్తుతం మహిళ్‌మతి ఇయక్కం పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అయితే ఆమెకు పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఎక్కువ. దీంతో త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం వినిపిస్తోంది. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సత్యరాజ్ కూతురి లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి