iDreamPost
android-app
ios-app

లేటు వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటుడు!

  • Published Dec 10, 2023 | 6:25 PM Updated Updated Dec 10, 2023 | 6:25 PM

రెడిన్‌ కింగ్స్‌స్లే తెలుగు నేరుగా సినిమాలు చేయలేదు. కానీ, డబ్బింగ్‌ చిత్రాలతో తరచుగా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు. తాజాగా జైలర్‌ చిత్రంలో తనదైన శైలి నటనతో అందర్నీ అలరించారు.

రెడిన్‌ కింగ్స్‌స్లే తెలుగు నేరుగా సినిమాలు చేయలేదు. కానీ, డబ్బింగ్‌ చిత్రాలతో తరచుగా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు. తాజాగా జైలర్‌ చిత్రంలో తనదైన శైలి నటనతో అందర్నీ అలరించారు.

  • Published Dec 10, 2023 | 6:25 PMUpdated Dec 10, 2023 | 6:25 PM
లేటు వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటుడు!

రెడిన్‌ కింగ్స్‌స్లే.. అంటే గుర్తు పట్టలేకపోవచ్చు కానీ.. ఆ వ్యక్తిని చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. ఓ ఈయనా.. కమెడియన్‌ కదా.. అంటారు. 1998లో వచ్చిన ‘అవల్‌ వరువాలా’ సినిమాలో ఓ చిన్న పాత్ర చేశారు. ఆ పాత్రకు పేరు కూడా లేదు. ఆయన చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు పాతికేళ్లుపైనే అవుతోంది. అయినా ఆయనకు 2018 వరకు సరైన అవకాశాలు రాలేదు. 2018లో వచ్చిన ‘‘ కొలమావు కోగిల’’ చిత్రంతో నటుడిగా ఆయనకు మంచి​ గుర్తింపు వచ్చింది.

ఈ మూవీని ప్రముఖ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించారు. నెల్సన్‌ దిలీప్‌కు.. రెడిన్‌కు చాలా ఏళ్ల పరిచయం ఉంది. ఆ పరిచయంతో దిలీప్‌ తన ప్రతీ సినిమాలో ఆయనకు అవకాశాలు ఇస్తున్నారు. 2021లో వచ్చిన డాక్టర్‌ చిత్రంలో నటనతో రెడిన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు వచ్చింది. వరుస అవకాశాలు ఆయన తలుపు తడుతున్నాయి. తమిళంలో అందరు టాప్‌ స్టార్‌లతో రెడిన్‌ మూవీలు చేస్తున్నారు. కమల్‌, రజినీ, సూర్య, విజయ్‌, అజిత్‌, ధనుష్‌, శివకార్తికేయ తదితరులతో సినిమా చేశారు.

రెడిన్‌ తెలుగులో నేరుగా సినిమాలు చేయలేదు. రామ్‌ హీరోగా.. హరి దర్శకత్వం వహించిన ‘ ది వారియర్‌’ అనే బైలింగువల్‌ మూవీలో నటించారు. డబ్బింగ్‌ చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన రెడిన్‌ తాజాగా ఓ ఇంటి వాడయ్యాడు. లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు. రెడిన్‌ తమిళ సీరియల్‌ నటి సంగీతతో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

actor marriage int old age

ఈ ఫొటోలను చూసిన వారు అదంతా సినిమా షూటింగ్‌ది అయి ఉండొచ్చని అనుకుంటూ ఉన్నారు. అయితే, రెడిన్‌, సంగీత నిజంగానే పెళ్లి చేసుకున్నారని తేలింది. నటుడు సతీష్‌ కృష్ణన్‌ వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. దీంతో వారి పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చినట్లు అయింది. అయితే, రెడిన్‌ 46 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

కాగా, రెడిన్‌ సినిమాల్లోకి డ్యాన్సర్‌ అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చారు. చాలా మూవీలకు సైడ్‌ డ్యాన్సర్‌గా పనిచేశారు. కొన్ని ఈవెంట్లలో కూడా ఆయన డ్యాన్సులో చేసేవారు. దాదాపు ఇరవై ఏళ్లు ఇలానే కష్టపడుతూ వచ్చారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రెడిన్‌ జీవితాన్ని మార్చేశారు. మరి, లేటు వయసులో రెడిన్‌ పెళ్లి చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş