iDreamPost
android-app
ios-app

కాంచన్ 4 పై రాఘవ లారెన్స్ ఏమన్నారంటే?

  • Published Jun 10, 2024 | 11:00 AM Updated Updated Jun 10, 2024 | 11:34 AM

Raghava Lawrence: సినీ ఇండస్ట్రీలో మల్టీపుల్ టాలెంట్ ఉన్న నటులు చాలా తక్కువ మంది ఉంటారు.. అలాంటి వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. కొరియోగ్రాఫర్ మొదలైన ప్రయాణం నటుడు, నిర్మాత, దర్శకుడి స్థాయికి ఎదిగింది.

Raghava Lawrence: సినీ ఇండస్ట్రీలో మల్టీపుల్ టాలెంట్ ఉన్న నటులు చాలా తక్కువ మంది ఉంటారు.. అలాంటి వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. కొరియోగ్రాఫర్ మొదలైన ప్రయాణం నటుడు, నిర్మాత, దర్శకుడి స్థాయికి ఎదిగింది.

  • Published Jun 10, 2024 | 11:00 AMUpdated Jun 10, 2024 | 11:34 AM
కాంచన్ 4 పై రాఘవ లారెన్స్ ఏమన్నారంటే?

సినిమా ఇండస్ట్రీలోకి మామూలు డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ తర్వాత కొరియోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యాడు.  స్టార్ హీరోలకు మంచి హిట్స్ అందించారు. కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతూనే నటుడు, దర్శకుడిగా తన సత్తా కొనసాగించాడు. ముని చిత్రంతో హర్రర్‌కి కామెడీ జత చేసి కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఆ తర్వాత కాంచన చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలా కాంచన మూవీ సీక్వెల్ కూడా ప్రేక్షకులను అలరించాయి. కాంచన 3 తర్వాత ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఆ మధ్య చంద్రముఖి 2 తో లారెన్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా అనుకున్న విజయం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం కాంచన 4 పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో ప్రభుదేవ తర్వాత కొరియోగ్రాఫర్ నుంచి నటుడు, డైరెక్టర్ గా సత్తా చాటిన వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. ‘ముని’ సినిమాలో దెయ్యాంతో భయపెడుతూనే.. కామెడీ ట్రాక్ తో కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత కాంచన చిత్రంతో కొత్త ట్రెండ్ సృష్టించాడు. అలా కాంచన 2, కాంచన 3 చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాఘవ ఇటీవల చంద్రముఖి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో అభిమానులు కాంచన 4 మూవీ గురించి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం పై రక రకాల ప్రచారం జరుగుతుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

ఇక కాంచన 4 మూవీ గురించి డైరెక్టర్, నటుడు రాఘవ లారెన్స్ స్పందించారు.‘ కాంచన 4 మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ రూమర్సే.. అందులో వాస్తవం లేదు అన్నారు. ఈ మూవీలో నటీనటులు మా నిర్మాణ సంస్థ రాఘవ ప్రొడక్షన్స్ నుంచి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం’ అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కాంచన 4 మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. సెప్టెంబర్ లో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కాస్త ఆలస్యం అయినా.. కాంచన 4 తో మరోసారి ఏ విధంగా నవ్విస్తూ భయపెడతాడో చూడాలి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet