iDreamPost
android-app
ios-app

తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్?

  • Author Soma Sekhar Published - 12:46 PM, Mon - 13 November 23

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ-డాక్టర్ పల్లవి వర్మ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వార్తలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ-డాక్టర్ పల్లవి వర్మ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వార్తలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 12:46 PM, Mon - 13 November 23
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్?

నిఖిల్ సిద్దార్థ్.. హ్యాపీడేస్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దంగా ఉన్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. ఇదిలా ఉండగా ఈ యంగ్ హీరోకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? నిఖిల్ తండ్రి కాబోతున్నాడన్న న్యూస్. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు 2020లో పెళ్లితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కాగా.. ఈ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం లేకపోలేదు. కొద్దిరోజుల క్రితం నిఖిల్-పల్లవి ఓ వేడుకకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో పల్లవి బేబీ బంప్ తో కనిపించారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రముఖులు, నెటిజన్లు.

అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు నిఖిల్ దంపతులు. ఇదిలా ఉంటే ఇప్పటికే మరో హీరో శర్వానంద్ కూడా తండ్రి కాంబోతున్నాడన్న వార్తలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కాగా.. నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభూ’, కార్తికేయ 3 తో పాటుగా మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. స్వయంభూ కోసం మార్షల్ ఆర్ట్స్, యుద్ధవిద్యలు నేర్చుకుంటున్నాడు. దాదాపు మూడు నెలల పాటు వీటిపై నిఖిల్ శిక్షణ తీసుకుంటున్నాడు. అతడి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది స్వయంభూ మూవీ. ఈ చిత్రంలో ఓ వారియర్ గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు నిఖిల్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet