iDreamPost
android-app
ios-app

షూటింగ్ పూర్తవ్వకుండానే ఆ మూవీ రిలీజ్ చేశారు.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 08:19 PM, Thu - 26 October 23

తాను నటించిన ఓ సినిమాను షూటింగ్ పూర్తవ్వకుండానే రిలీజ్ చేశారని, అందుకే ఆ మూవీ ఫ్లాప్ అయ్యిందని నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ మూవీ ఏది? ఈ షాకింగ్ కామెంట్స్ చేయడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

తాను నటించిన ఓ సినిమాను షూటింగ్ పూర్తవ్వకుండానే రిలీజ్ చేశారని, అందుకే ఆ మూవీ ఫ్లాప్ అయ్యిందని నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ మూవీ ఏది? ఈ షాకింగ్ కామెంట్స్ చేయడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 08:19 PM, Thu - 26 October 23
షూటింగ్ పూర్తవ్వకుండానే ఆ మూవీ రిలీజ్ చేశారు.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్

సాధారణంగా సినిమా కార్యక్రమాల్లో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు చేసే షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. తమ చిత్రాల గురించి, పక్క సినిమాల గురించే చేసే కామెంట్స్ కొన్ని కొన్ని సార్లు వివాదాలకు కూడా దారి తీయడం మనం చూసే ఉన్నాం. అయితే హీరోలు తన సొంత సినిమాలు ఫ్లాప్ అయినా.. వాటి గురించి మాట్లాడడానికి అంతగా ఇష్టపడరు. కానీ తాజాగా యంగ్ హీరో నిఖిల్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తాను నటించిన ఓ సినిమాను షూటింగ్ పూర్తవ్వకుండానే రిలీజ్ చేశారని, అందుకే ఆ మూవీ ఫ్లాప్ అయ్యిందని నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అతడు చేసిన కామెంట్స్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.

యంగ్ హీరో నిఖిల్ తాజాగా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తాను నటించిన ఓ చిత్రం షూటింగ్ మెుత్తం పూర్తి కాకుండానే రిలీజ్ చేశారని, అందుకే ఆ మూవీ ఫ్లాప్ అయ్యిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిఖిల్.. ఇటీవల తాను నటించిన ‘స్పై’ చిత్రం గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ..”స్పై మూవీ విషయంలో చాలా తప్పులు జరిగాయి. సినిమా షూటింగ్ ఇంకా 10 రోజులు మిగిలి ఉండగానే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసేసి మూవీని విడుదల చేసేశారు. అందుకే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని నా అభిప్రాయం. ఇక ‘స్పై’ మూవీ ఫ్లాప్ అయినందుకు ఫ్యాన్స్ కు క్షమాపణలు కూడా చెప్పా. కానీ రానున్న సినిమాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటా. క్వాలిటీ విషయాల్లో ఎక్కడా రాజీ పడను” అంటూ నిఖిల్ అసహనం వ్యక్తం చేశాడు. నా ఫ్యాన్స్ కు మంచి సినిమాలే అందిస్తానని మాటించాడు నిఖిల్.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో కార్తికేయ-3, స్వయంభూ, ది ఇండియా హౌస్ సినిమాలలో నటిస్తున్నాడు. కాగా.. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్వయంభూ మూవీ కోసం దాదాపు 3 నెలల పాటు వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ, ఆయుధ విన్యాసాలు నేర్చుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ.. అభిమానులతో టచ్ లోనే ఉంటూ వస్తున్నాడు ఈ యువ హీరో. ఇక నిఖిల్ చేసిన కామెంట్స్ పై స్పై మూవీ టీమ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి స్పై సినిమా విషయంలో నిఖిల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio