iDreamPost
android-app
ios-app

కాలు విరగొట్టుకున్న నవదీప్‌.. రివేంజ్‌ తీర్చుకున్న నటి!

  • Published Jul 06, 2023 | 4:36 PM Updated Updated Jul 06, 2023 | 4:36 PM
  • Published Jul 06, 2023 | 4:36 PMUpdated Jul 06, 2023 | 4:36 PM
కాలు విరగొట్టుకున్న నవదీప్‌.. రివేంజ్‌ తీర్చుకున్న నటి!

నటుడు నవదీప్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్‌ సరైన హిట్స్‌ లేక ప్రస్తుతం సైడ్‌ క్యారెక్టర్లు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. సినిమాల కన్నా కూడా వివాదాల్లో నవదీప్‌ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్న నవదీప్‌ కాలికి గాయం అయ్యింది. స్టిక్‌ సాయంతో నడుస్తున్నాడు. నవదీప్‌ కాలి గాయంతో బాధపడుతుండగా.. ఓ నటి మాత్రం.. ఇదే కరెక్ట్‌ టైం అనుకుని నవదీప్‌ మీద రివేంజ్‌ ప్లాన్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇంతకు ఎవరా నటి.. అసలు నవదీప్‌ కాలికి గాయం ఎలా అయ్యింది వంటి వివరాలు..

నటి తేజస్వి మదివాడ.. నవదీప్‌ గురించి పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. నవదీప్‌ను ఆటపట్టిస్తూ.. చేసిన ఈ రీల్‌ వైరల్‌గా మారింది. ఇక దీనిలో నవదీప్‌ మోకాలికి గాయంతో కనిపించాడు. చేతి కర్ర సాయంతో నడుస్తున్నాడు. గాయపడ్డ నవదీప్‌.. సోఫాలో కూర్చుని.. తన కాలుని ఒక చిన్న స్కూల్‌పై చాపుకుని ఉంటాడు. ఇక తేజస్విని.. ఆ కాలిని చూసి.. వెటకారంగా చూస్తూ.. నీ సుఖమే నే కోరుకున్నా అంటూ ఘటంసాల పాటకు డ్యాన్స్‌ చేసింది. అంతటితో ఆగక.. నీ సుఖమే నే కోరుకున్నా.. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనే క్యాప్షన్‌తో వీడియోని పోస్ట్‌ చేయగా అది వైరలవుతోంది.

మరి తేజస్విని ఎందుకు ఇలా చేసింది అంటే.. గతంలో ఓసారి నవదీప్‌.. తేజస్విని ఇలానే ఆటపట్టించాడు. అందుకు ఇప్పుడు ఆమె బదులు తీర్చుకుంది. ఇక నటుడు నవదీప్, తేజస్విని ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. వీరిద్దరు కలిసి ఐస్‌క్రీమ్‌ సినిమాలో యాక్ట్‌ చేశారు. అప్పటి నుంచి వీరిద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యారు. తమ స్నేహం గురించి వీరు అనేక సార్లు చెప్పుకొచ్చారు. ప్రొఫెషనల్ కెరీర్‌లో బిజీగా ఉండే వీరిద్దరూ వీలు కుదిరినప్పుడల్లా కలుస్తూ ఉంటారు. పార్టీలు కూడా చేసుకుని ఏంజాయ్‌ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం తేజ్విని ‘భక్తి బాంబ్’తో బిజీగా ఉండగా.. నవదీప్‌.. వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు.

అయితే, నవదీప్‌కు గాయమవ్వడంపై యాంకర్ విష్ణుప్రియ, సీనియర్ యాంకర్ గాయత్రి భార్గవి, నటుడు సాయి కిరణ్ తదితర సెలబ్రిటీలు స్పందించారు. నవదీప్ త్వరగా కోలుకోవాలని విష్ణుప్రియ కామెంట్ చేశారు. ‘నువ్వు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుడ్ ఎంటర్‌టైన్మెంట్, మంచి ఫన్‌ ప్రొగ్రాం. ఎంజాయ్, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని గాయత్రి భార్గవి పేర్కొన్నారు. ఇక నటుడు సాయి కిరణ్ అయితే తేజు ఆన్ ఫైర్ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet