iDreamPost
android-app
ios-app

Actor Nandu: ఆ 12 రోజుల నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న నటుడు నందు

  • Published Feb 12, 2024 | 2:42 PM Updated Updated Feb 12, 2024 | 2:42 PM

త్వరలోనే మరో బిడ్డకు వెల్‌కం చెప్పేందుకు రెడీ అవుబోతున్న ఆనందంలో ఉన్న నందు.. ఓ సంఘటనను గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ వివరాలు..

త్వరలోనే మరో బిడ్డకు వెల్‌కం చెప్పేందుకు రెడీ అవుబోతున్న ఆనందంలో ఉన్న నందు.. ఓ సంఘటనను గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ వివరాలు..

  • Published Feb 12, 2024 | 2:42 PMUpdated Feb 12, 2024 | 2:42 PM
Actor Nandu: ఆ 12 రోజుల నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న నటుడు నందు

నటుడు నందు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో నటిస్తూనే.. క్రికెట్‌ యాంకరింగ్‌ చేస్తూ.. టీవీ షోలలో కూడా కనిపిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంటాడు. చెరగని చిరునవ్వు అతడి సొంతం. ఇక నందు భార్య గీతా మాధురి కూడా అందరికి పరిచయమే. ఇక వీరిద్దరిది అన్యోన్య దాంపత్యం అని చెప్పవచ్చు. గీతా మాధురి సింగర్‌గా రాణిస్తుండగా.. నందు యాక్టర్‌గా సత్తా చాటుతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ దంపతులు శుభవార్త చెప్పారు. త్వరలోనే వీరి జీవితంలోకి మరో బిడ్డ రానుంది. కొన్ని రోజుల క్రితం గీతా మాధురి సీమంతం ఫొటోలు షేర్‌ చేసింది. ఇక ఈ నెలలోనే గీతా మాధురి డెలివరి డేట్‌ ఉంది.

రెండో బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఈ సంతోష సమయంలో.. నందు గతంలో జరిగిన ఓ చేదు సంఘటనను తల్చుకుని ఎమోషనల్‌ అయ్యాడు. స్టేజీ మీద వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ 12 రోజులు నరకం అనుభవించాను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఆ వివరాలు.. తాజాగా నందు ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హైపర్‌ ఆది.. మీ జీవితంలో చోటు చేసుకున్న ఎమోషనల్‌ సంఘటన గురించి చెప్పమని అడిగాడు. అప్పుడు నందు.. తన జీవితంలో జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నాడు.

నందు మాట్లాడుతూ.. ‘‘గతంలో నా మీద కొన్ని రూమర్స్‌ వచ్చాయి. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా నా పేరును లాగి.. న్యూస్‌ చానెల్స్‌లో పదే పదే రిపీట్‌ చేస్తూ చూపించారు. యూట్యూబ్‌ చానెల్స్‌లో కూడా ప్రచారం చేశారు. అలా ఏకంగా 12 రోజుల పాటు నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిశాక.. సింపుల్‌గా ఒక స్క్రోలింగ్‌ వేశారు. దాని వల్ల మేం చాలా బాధపడ్డాం’’ అంటూ నందు వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నందు మాట్లాడింది డ్రగ్స్‌ కేసు గురించి అని అర్థం అవుతోంది. నందు మాటలకు అక్కడ ఉన్న శేఖర్ మాస్టర్, హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇక కెరీర్‌ విషయానికి వస్తే.. నందు ప్రస్తుతం ఢీ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలానే క్రికెట్‌ యాంకర్‌గా కూడా కొనసాగుతున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş